Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి మైత్రేయ నా భార్య అంటూ కోర్టును ఆశ్రయించిన దర్శకుడు రిషి!

Webdunia
బుధవారం, 3 సెప్టెంబరు 2014 (09:42 IST)
కన్నడ వర్ధమాన నటి మైత్రేయ నా భార్య అని, తమకిద్దరికీ దశాబ్దకాలం క్రితం వివాహమైనట్టు కన్నడ నటుడు రిషీ కోర్టును ఆశ్రయించాడు. దీంతో ఈ కేసులో మరో ట్విస్ట్ ఆరంభమైంది. ఇదిలావుండగా, ‘ప్రేమ-పెళ్లి-మోసం ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్ గౌడ పరారయ్యాడు. దీంతో అతనికి బెంగళూరు పోలీసులు సోమవారం అల్టిమేటం ఇచ్చారు. బుధవారంలోగా లొంగిపోకపోతే అరెస్టు తప్పదని తీవ్రంగా హెచ్చరించారు. 
 
ప్రేమ పేరిట తనను పెళ్లి చేసుకుని, మరో యువతితో నిశ్చితార్థం చేసుకుంటున్నాడంటూ వర్ధమాన నటి మైత్రేయి గౌడ గత వారం ఆర్‌.టి.నగర్‌ పోలీసులకు ఫిర్యా దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అదే రోజు కార్తీక్‌ గౌడ నివాసానికి పోలీసులు నోటీసులు పంపగా అతడు అదృశ్యమయ్యాడు. అటుపైన ముందస్తు బెయిలు కోసం కోర్టును ఆశ్రయించగా దీనిపై ఈ నెల 4న విచారణ జరగనుంది. ఈ లోగానే అతడిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్న పోలీసులు, తాజా హెచ్చరిక జారీ చేశారు. 
 
మరోవైపు.. కార్తీక్ గౌడ తనను రేప్ చేశాడని, తనను పెళ్ళి చేసుకుని ఇప్పుడు మరో పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడని కన్నడ సినీ నటి మైత్రేయ కోర్టుకు ఎక్కిన కేసులో కొత్త ట్విస్ట్ మొదలైంది. రైల్వే మంత్రి కుమారుడిపై కేసు పెట్టిన హీరోయిన్ మైత్రేయ తన భార్య అంటూ కన్నడ దర్శకుడు రిషి బెంగుళూరు కోర్టులో ఫిర్యాదు చేశాడు. 
 
‘సూర్య ది గ్రేట్’ అనే సినిమా తీస్తున్న సమయంలో ఆమెతో తనకు పరిచమైందని, మైత్రేయతో తన పెళ్ళి ఒక హోటల్లో 2008లో జరిగిందని దర్శకుడు రిషి పేర్కొన్నాడు. ప్రస్తుతం తనకు దూరంగా ఉంటున్న మైత్రేయని తనతో కాపురానికి ఒప్పించాలని ఆయన కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments