Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడు మోసం చేశాడనీ లైవ్‌లో పురుగులమందు తాగిన ప్రియురాలు

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (12:55 IST)
కన్నడ బుల్లితెర నటి చందన ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడు మోసం చేశాడని పేర్కొంటూ లైవ్‌లో ఈ దారుణానికి పాల్పడింది. దీంతో అపస్మారక స్థితిలోకి జారుకున్న 29 యేళ్ళ చందనను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హాసన్ జిల్లా బేలూరుకు చెందిన చందన బుల్లితెర నటిగా రాణిస్తోంది. ఈమె దినేశ్‌ అనే యువకుడిని గత ఐదేళ్లుగా ప్రేమిస్తూ వస్తోంది. ఈ క్రమంలో చందన పెళ్లి ప్రతిపాదన లేవనెత్తగా దినేశ్ తిరస్కరించాడు. దీంతో దినేశ్ కుటుంబ సభ్యుల వద్ద చందన తమ పెళ్లి విషయాన్ని ప్రస్తావించగా వారు అవమానించి పంపించారు. 
 
దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న చందన నిన్న బెంగళూరులోని తన నివాసంలో పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకుంది. అనంతరం దానిని దినేశ్‌కు వాట్సాప్ చేసింది.
 
వీడియో చూసిన దినేశ్ కంగారు పడి చందన ఇంటికొచ్చాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న చందనను ఆసుపత్రికి తరలించాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగానే చందన ప్రాణాలు కోల్పోయింది. చందన సెల్ఫీ వీడియో ఆధారంగా దినేశ్ కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న దినేశ్ కోసం గాలిస్తున్నారు.
 
చందన తీసిన సెల్ఫీ వీడియోలో దినేశ్‌ తనను మోసం చేశాడని విలపించింది. తన డబ్బులు వాడుకున్నాడని, తన కెరియర్‌ను అతడి కోసం అర్పించానని వాపోయింది. ఇంతా చేస్తే అతడు మరో అమ్మాయితో తిరుగుతున్నాడని బోరుమంది. ఇక జీవించడం వృధా అని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments