Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టాలిన్‌కే సీఎం పదవి.. కమల్ హాసన్‌ Vs రజనీకాంత్.. లయోలా సర్వే

తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతికి అనంతరం అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయపరంగా రోజుకో మార్పు జరుగుతోంది. అన్నాడీఎంకేలో వర్గాలు, విలీనం జరిగినా అమ్మ సర్కారు సంక్షేమ కార్యక్రమాలు మందకొ

Webdunia
శనివారం, 9 సెప్టెంబరు 2017 (14:52 IST)
తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతికి అనంతరం అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయపరంగా రోజుకో మార్పు జరుగుతోంది. అన్నాడీఎంకేలో వర్గాలు, విలీనం జరిగినా అమ్మ సర్కారు సంక్షేమ కార్యక్రమాలు మందకొడిగా సాగుతున్నాయి. ఇలా తమిళ రాజకీయాల్లో స్థిరత్వం కరువు కావడంతో కొత్త రాజకీయ నేత నాయకుడిగా ఎప్పుడొస్తాడా అని ప్రజలు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. 
 
అంతేగాకుండా తమిళనాడు లీడర్స్ డీఎంకే చీఫ్ కరుణానిధి, దివంగత సీఎం జయలలిత లాంటి సమర్థవంతమైన నేతలు ఎవరొస్తారా? అని వేచి వున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల సినీ నటులు కమల్ హాసన్, రజనీకాంత్ రాజకీయాల్లోకి ఎంట్రీ కానున్నారని వార్తలొచ్చాయి. 
 
ఇలాంటి పరిస్థితుల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ కంటే కమల్ హాసన్ రాజకీయాల్లో మెరుగ్గా రాణించే అవకాశాలున్నట్లు చెన్నైలోని ప్రసిద్ధ లయోలా కళాశాల మాజీ విద్యార్థులు నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. కొత్త పార్టీ ప్రారంభించడం ద్వారా రజనీకాంత్ రాజకీయాల్లో రాణిస్తారని 13 శాతం మంది మద్దతు తెలపగా, కమల్ హాసన్ రాజకీయ పార్టీని స్థాపిస్తే ధీటుగా రాణిస్తారని 29 శాతం మంది ఓటేశారు.
 
అయితే సీఎంగా కొనసాగేందుకు డీఎంకే నేత స్టాలిన్‌కే అత్యధికంగా 41 శాతం ఓట్లు లభించాయి. స్టాలిన్ తర్వాతి స్థానంలో రజనీకాంత్, 13 శాతం ఓట్లతో కమల్ హాసన్ మూడో స్థానానికి పడిపోయారు. ఇక ఓపీఎస్‌కు కేవలం సీఎంగా ఉండేందుకు కేవలం ఒక్కశాతం ఓట్లే లభించాయి.

అయితే 58.8 శాతం మంది తమిళనాడులో గవర్నర్ పాలన వైపు మొగ్గుచూపారు. సర్కారును రద్దు చేసి గవర్నర్ పాలన విధించడం ద్వారా 2019 ఎన్నికల్లో గెలిచే పార్టీకి పట్టం కట్టవచ్చునని అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని.. ప్రతి రాత్రి బయటకు వెళ్లడం..?

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments