Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశం అంటే భారతదేశంలా ఉండాలని కలాం అనేవారు : లక్ష్మీ నారాయణ

Webdunia
బుధవారం, 29 జులై 2015 (09:15 IST)
దేశం అంటే భారతదేశంలా.. పౌరులంటే భారతీయులు అనేలా ఉండాలని భారత మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం అనేవారని సీబీఐ మాజీ జాయింట్ డైరక్టర్, ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ గుర్తు చేసుకున్నారు. కలాం మృతిపై ఆయన స్పందిస్తూ.. దేశంలోని యువశక్తి అంతా ఏకమైతే 2020 కల్లా భారత్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమమైన దేశంగా తీర్చిదిద్దవచ్చని చెప్పేవారన్నారు. కలాం ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇపుడు ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ఆయన ఆలోచనలు భావితరాలకు కథలుగా చెబుదామని జేడీ పిలుపునిచ్చారు. 
 
ప్రస్తుతం థానే జాయింట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న జేడీ.. కలాం మృతిపట్ల తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. కలాంలాంటి వ్యక్తిని మనం చూడటం అదృష్టమన్నారు. ఆయన అందించిన స్ఫూర్తిని మనమంతా కలిసి ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. హైదరాబాదులో ఉండగా, కలాంతో కలిసి పనిచేసే అవకాశం లభించిందని, ఆయన ఆలోచనలు, ఆచరణ అనితరసాధ్యమన్నారు. విద్యార్థులు, యువతలో నిద్రాణమై ఉన్న శక్తిని మేల్కొలపాలని ఆయన అనేవారని గుర్తు చేసుకున్నారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments