Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీంకోర్టు తదుపరి కొత్త చీఫ్ జస్టీస్‌గా సంజీవ్ ఖన్నా - నేపథ్యం ఏంటి?

ఠాగూర్
శుక్రవారం, 25 అక్టోబరు 2024 (06:13 IST)
భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు. ఆయన ఈ నెల 11వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతమున్న చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ పదవీకాలం వచ్చే నెల 11 తేదీన ముగియనుంది. ఆ తర్వాత కొత్త చీఫ్ జస్టిస్‌గా సంజీవ్‌ ఖన్నా బాధ్యతలు స్వీకరించనున్నారు. 
 
సంజీవ్ ఖన్నా నవంబర్ 11వ తేదీన సీజేఐగా ప్రమాణ స్వీకారం చేస్తారని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ వెల్లడించారు. ప్రస్తుత సీజేఐ డీవై చంద్రచూడ్ పదవీ కాలం నవంబరు 10వ తేదీన ముగియనుంది. దీంతో జస్టిస్ ఖన్నా పేరును చంద్రచూడ్ సిఫార్సు చేయగా... రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీంతో వచ్చే నెల 11వ తేదీన సుప్రీంకోర్టు 51వ సీజేఐగా జస్టిస్ ఖన్నా బాధ్యతలు స్వీకరించనున్నారు.
 
జస్టిస్ సంజీవ్ ఖన్నా 2025 మే 13వ తేదీ వరకు సీజేఐగా కొనసాగుతారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్ న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. తీసా జారీ జిల్లా కోర్టు, హైకోర్టు, ట్రైబ్యునళ్లలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2005లో ఢిల్లీ హైకోర్టులో అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 2006లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments