Webdunia - Bharat's app for daily news and videos

Install App

జస్టిస్​ గొగొయి నూతన రికార్డు..!

Webdunia
శనివారం, 16 నవంబరు 2019 (18:38 IST)
పదవీ విరమణ తరుణంలో నూతన రికార్డు నెలకొల్పారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్​ గొగొయి. 650మంది న్యాయమూర్తులు, 15000 మంది న్యాయాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు.

న్యాయ వ్యవస్థలోని ప్రతి ఒక్కరూ జాతి నిర్మాతలని వ్యాఖ్యానించిన ఆయన కోర్టుల్లో సరైన మౌలిక వసతులు లేవని అభిప్రాయపడ్డారు. ఆదివారం పదవీ విరమణ చేయనున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్​ గొగొయి నూతన రికార్డు నెలకొల్పారు.

దేశంలోని 650మంది న్యాయమూర్తులు, 15 వేలమంది జిల్లా, తాలుకా న్యాయాధికారులతో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఆయన సంభాషించారు. కోర్టుల్లో సరైన మౌలిక వసతులు లేవని పేర్కొన్న ఆయన కొంతమంది న్యాయవాదులతో.. న్యాయాధికారులు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వ్యాఖ్యానించారు.

ఉద్యోగంలో ఎదురయ్యే ఇలాంటి సమస్యలను అధిగమించి మరింత సంకల్పంతో న్యాయమూర్తులు ముందుకు సాగాలని ఆకాంక్షించారు. జడ్జిలు పెండింగ్ కేసులను తగ్గించేందుకు కృషి చేస్తున్నారంటూ అభినందించారు జస్టిస్​ గొగొయి.

న్యాయవ్యవస్థలో పనిచేసే ప్రతి ఒక్కరూ జాతి నిర్మాతలని అభిప్రాయపడ్డారు. ప్రధాన న్యాయమూర్తిగా తన పదవీకాలం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు జస్టిస్​ గొగొయి.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments