Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొన్న గౌరీ లంకేష్.. నేడు కేజే సింగ్‌.. జర్నలిస్టుల హత్యల పరంపర

పంజాబ్‌కు చెందిన సీనియర్‌ జర్నలిస్ట్‌ కేజే సింగ్‌ హత్యకు గురయ్యారు. మొహాలీలోని తన ఇంట్లో సింగ్‌తోపాటు ఆయన తల్లి గురు చరణ్‌కౌర్‌ను దుండగులు హత్య చేశారు. వీరు హత్యకు గురైన విషయాన్ని శనివారం మధ్యాహ్నం ఒం

Webdunia
ఆదివారం, 24 సెప్టెంబరు 2017 (11:58 IST)
పంజాబ్‌కు చెందిన సీనియర్‌ జర్నలిస్ట్‌ కేజే సింగ్‌ హత్యకు గురయ్యారు. మొహాలీలోని తన ఇంట్లో సింగ్‌తోపాటు ఆయన తల్లి గురు చరణ్‌కౌర్‌ను దుండగులు హత్య చేశారు. వీరు హత్యకు గురైన విషయాన్ని శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సింగ్‌ బంధువులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. 
 
దుండుగులు అత్యంత విచక్షణారహితంగా ప్రవర్తినంచినట్టు తెలుస్తోంది. కేజే సింగ్‌ను పొట్టలో కత్తితో పొడిచి, గొంతు కోసిన దుండగులు ఆయన తల్లి కౌర్‌ను గొంతునులిమి చంపారు. వీటిపై అనుమానాస్పద హత్యగా భావించిన పంజాబ్‌ ప్రభుత్వం ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)తో విచారణకు ఆదేశించింది.
 
అలాగే, కేజేసింగ్ ఇంటికి రెండు ఇళ్ల తర్వాత ఏర్పాటు చేసిన సీసీకెమెరా ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అవివాహితుడైన కేజే సింగ్‌.. ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, ద టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో న్యూస్‌ ఎడిటర్‌గా పని చేశారు. ప్రస్తుతం కెనడాకు చెందిన పత్రికకు ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌గాసింగ్‌ పనిచేస్తున్నారు. 
 
కాగా మొన్నటికి మొన్న కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో సంఘ సేవకురాలు, సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్‌ను ఇదే విధంగా గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపిన విషయం తెల్సిందే. ఈ హత్యపై దేశ వ్యాప్తంగా దుమారం చెలరేగింది. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments