Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతకం ప్రకారం నాకు ఇద్దరు భార్యలు .. రెండో భార్యవు నీవేనంటూ విద్యార్థినికి టీచర్ వేధింపులు...!!

ఠాగూర్
గురువారం, 22 మే 2025 (12:10 IST)
బాలికను వేధింపులకు గురిచేసిన ఉపాధ్యాయుడు! జాతకం ప్రకారం తనకు ఇద్దరు భార్యలు ఉన్నారని, అందువల్ల రెండో భార్యగా నిన్నే పెళ్లి చేసుకుంటానంటూ వేధించసాగాడు. ఈ వేధింపులను భరించలేని ఆ విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం చేరవేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి ఆ కీచక టీచర్‌ను అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బోరనాడ ప్రాంతానికి చెందిన ఓ బాలిక స్థానికంగా ఉండే ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యాభ్యాసం చేస్తోంది. ఆ పాఠశాలలో దల్పత్ గార్గ్ అనే ఉపాధ్యాయుడు ఇంగ్లీష్ పాఠ్యాంశాన్ని బోధిస్తున్నాడు. ఈ ఉపాధ్యాయుడే బాలికను లైంగికంగా వేధించసాగాడు. తన జాతకం ప్రకారం ఇద్దరు భార్యలు ఉన్నారని, నిన్ను రెండో పెళ్ళి చేసుకుంటానంటూ వేధించసాగాడు. 
 
ఈ విషయాన్ని ఆ చిన్నారి తమ తల్లిదండ్రులకు చెప్పడంతో ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత సంబంధిత సీసీ టీవీ ఫుటేజీలతో పాటు నివేదికను ఉన్నతాధికారులకు పంపగా సదరు ఉపాధ్యాయుడుని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఉపాధ్యాయుడుపై ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేస్తున్న వారిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు ఉపాధ్యాయుడుపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

Pawan: నేషనల్ మీడియా అంతా వచ్చినా పవన్ కళ్యాణ్ ఎందుకు మొహంచాటేశారు?

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

Venu swamy : టాలీవుడ్ లో హీరో హీరోయిన్లు పతనం అంటున్న వేణుస్వామి ?

భ‌యం లేని రానా నాయుడుకి చాలా క‌ష్టాలుంటాయి : అర్జున్ రాంపాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం