Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుష్మా స్వరాజ్‌కు కిడ్నీ ఇస్తా.. ఓ మంత్రికి కాదు.. గొప్ప మనసున్న మహిళకు.. జోధ్‌పూర్ రైతు

కిడ్నీ సంబంధిత సమస్యలతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్‌కు కిడ్నీ దానం చేసేందుకు జోధ్‌పూర్‌కు చెందిన ఓ రైతు ముందుకు వచ్చారు. అయితే, సుష్మా ఓ మంత్రిగా ఉండ

Webdunia
శుక్రవారం, 18 నవంబరు 2016 (17:48 IST)
కిడ్నీ సంబంధిత సమస్యలతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్‌కు కిడ్నీ దానం చేసేందుకు జోధ్‌పూర్‌కు చెందిన ఓ రైతు ముందుకు వచ్చారు. అయితే, సుష్మా ఓ మంత్రిగా ఉండటం వల్లే తాను కిడ్నీ ఇవ్వడం లేదనీ, ఆమెకున్న గొప్ప మనసును చూసి కిడ్నీ దానం చేసేందుకు ముందుకు వచ్చినట్టు ఆయన ప్రకటించారు. 
 
మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న సుష్మా స్వరాజ్‌కు ప్రస్తుతం ఎయిమ్స్‌ వైద్యశాలలో డయాలిసిస్‌ చేస్తున్నారు. కిడ్నీ మార్చాలని వైద్యులు సూచించడంతో ఆమెపై అభిమానం ఉన్న పలువురు కిడ్నీ దానం చేస్తామంటూ ముందుకు వస్తున్నారు. ఇలాంటి వారిలో జోధ్‌పూర్‌కు సమీపంలోని ఎకలఖోరి అనే ప్రాంతానికి చెందిన రైతు కూడా ఉన్నారు. అతని పేరు వైషేక్‌ విష్ణోయి
 
'ఆపదలో ఉన్నవారు సహాయం కావాలంటే ఆమె వెంటనే స్పందిస్తారు. నిశ్శబ్దంగా పనిచేసుకుపోతారు. గల్ఫ్‌ దేశాల్లో ఉన్న ఎంతో మంది కార్మికులను రక్షించే విషయంలో ఆమె కీలక పాత్ర పోషించారు. నిబద్ధత, సహాయం చేసే గొప్ప మనసు ఆమె సొంతం. అందుకే ఆమెకు నా కిడ్నీ దానం చేస్తా..' అని ఆయన చెప్పుకొచ్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

మురారికి దేవకి నందన వాసుదేవకి చాలా వ్యత్యాసం వుంది : డైరెక్టర్ అర్జున్ జంధ్యాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments