Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్‌లో బీజేపీదే అధికారం... జమ్మూకాశ్మీర్‌లో మోడీ ప్రభంజనం!

Webdunia
శనివారం, 20 డిశెంబరు 2014 (18:02 IST)
జార్ఖండ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారంతో ముగిసింది. ఈ పోలింగ్ ముగిసిన తర్వాత నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాలి ఎక్కువగా ఉందని తేల్చాయి. ముఖ్యంగా జార్ఖండ్ రాష్ట్రంలో బీజేపీ అధికారం కైవసం చేసుకోవడం ఖాయమని, అదీ కూడా భారీ మెజార్టీతో విజయం ఖాయమని తేల్చాయి. 
 
అలాగే జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ ప్రభావం అధికంగా ఉందని తేల్చాయి. అయితే, ఇక్కడ మాజీ ఎంపీ ముఫ్తీ మహ్మద్ సయ్యిద్‌ నేతృత్వంలోని పీడీపీకి అధిక స్థానాలు దక్కే అకాశం ఉన్నట్టు తేల్చాయి. ఇక్కడ బీజేపీ రెండో స్థానం లేదా మరో పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు తేల్చాయి. 
 
శనివారం రాత్రి ఏబీపీ నీల్సన్ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ భారీ మెజారిటీతో అధికార పీఠం దక్కించుకోనుంది. మొత్తం 81 స్థానాలకు గాను ఎన్డీఏ 52 స్థానాలను కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. ఇందులో బీజేపీ-46, ఏజేఎన్ యూ-5, ఎల్జేపీ-1 స్థానాలను గెలుచుకోబోతున్నాయి. యూపీఏ కూటమి కేవలం 9 స్థానాలకే పరిమితం కానుంది. ఇందులో కాంగ్రెస్-7, ఆర్జేడీ-1, జేడీయూ-1 స్థానాన్ని గెలుచుకోనున్నాయి. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments