Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ ముఖ్యమంత్రి జితిన్ రాం మాంఝీకి రాంరాం..!?

Webdunia
సోమవారం, 24 నవంబరు 2014 (15:19 IST)
వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీ అధినాయకత్వానికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్న బీహార్ ముఖ్యమంత్రి జితిన్ రాం మాంఝీకి ఉద్వాసన పలకాలని జనతాదళ్ (యునైటెడ్) అధినేత శరద్ యాదవ్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు జాతీయ మీడియాలో వార్తలు ప్రసారమవుతున్నాయి. 
 
ఈ వార్తల ఊహాగానాలపై జితిన్ రాం స్పందిస్తూ తన కార్యాలయంలో ఇంకెన్ని రోజులో ఉండే అవకాశంలేదని, తనను సీఎం పదవి నుంచి తొలగించేందుకు పార్టీలోని తన శత్రువులు ప్రయత్నిస్తున్నారని తాజాగా వ్యాఖ్యానించారు. 
 
'ముఖ్యమంత్రి స్థానం నుంచి నన్ను తీసివెయ్యాలని చూస్తున్నారని నాకు తెలుసు. నవంబర్ చివరి వరకు నేను ఉండొచ్చు, లేకపోవచ్చు' అని మాంఝీ తెలిపారు. దాంతో నిజంగానే ఆయనను తీసివేస్తున్నారన్న ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. 
 
ఆర్థికంగా వెనుకబడిన దళితవర్గం నుంచి వచ్చిన మాంఝి ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు బీహార్ రాజకీయాల్లో కలకలం రేపిన విషయం తెల్సిందే. దీంతో ఆయన మాజీ సీఎం నితీష్ కుమార్, జేడీ (యు) అధినేత శరదవ్ యాదవ్ సమావేశమై రెండు గంటల పాటు చర్చించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments