Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మకు గుండెపోటు.. తమిళనాడులో హైటెన్షన్... రంగంలోకి కేంద్ర బలగాలు

అన్నాడీఎంకే జయలలితకు గుండెపోటు వచ్చింది. ఈ వార్త తెలియడంతోనే రాష్ట్ర వ్యాప్తంగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే చెన్నైలోని అపోలో ఆసుపత్రి దగ్గర లక్షలాది మంది అమ్మ అభిమానులు గుమికూడారు.

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2016 (01:15 IST)
అన్నాడీఎంకే జయలలితకు గుండెపోటు వచ్చింది. ఈ వార్త తెలియడంతోనే రాష్ట్ర వ్యాప్తంగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే చెన్నైలోని అపోలో ఆసుపత్రి దగ్గర లక్షలాది మంది అమ్మ అభిమానులు గుమికూడారు. దీంతో జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రితో పాటు.. చెన్నై నగర వ్యాప్తంగా భారీ సంఖ్యలో బలగాలను మొహరించారు. అంతేకాకుండా, కేంద్ర బలగాలను కూడా రప్పించి.. మొహరించారు. ముందు జాగ్రత్త చర్యగా అన్ని రకాల బందోబస్తు చర్యలు చేపట్టారు. 
 
జయలలితకు ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నా... ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అల్లర్లకు అవకాశం ఇవ్వకుండా చూడటానికి తమిళనాడు ఆదివారం అర్థరాత్రి నుంచి పోలీసులు నాకాబందీ కొనసాగిస్తున్నారు. 
 
మరోవైపు... అమ్మ జయలలిత ఆరోగ్యం కుదటపడాలని ఆదివారం అర్థరాత్రి నుంచి తమిళనాడులో పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు. సోమవారం అర్థరాత్రి చెన్నైతో పాటు తమిళనాడులోని పలు దేవాలయాల తలుపులు తీయించి పూజలు చేస్తున్నారు. రాత్రికిరాత్రి చెన్నైతో పాటు తమిళనాడులోని ఇతర ప్రాంతాల్లో రోడ్లలోనే హోమాలు చేస్తూ అమ్మ ఆరోగ్యం కుదటపడాలని ప్రార్థనలు చేస్తున్నారు.
 
జయలలిత ఆరోగ్యం విషమించడంతో జరగరానిది ఏదైనా జరిగితే పరిస్థితులు అదుపుతప్పుతాయని భావించిన ప్రభుత్వ పెద్దలు రంగంలోకి పారామిలటరీ బలగాలను రంగంలోకి దించింది. ఇందుకోసం కేంద్రం మూడు కంపెనీల పారామిలిటరీ బలగాలను పంపించినట్టు సమాచారం. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments