శశికళ జైలు జీవితం ముగిసింది.. నేడే విడుదల.. డిశ్చార్జ్‌పై నిర్ణయం

Webdunia
బుధవారం, 27 జనవరి 2021 (10:28 IST)
అన్నాడీఎంకే బహిష్కృత నేత, జయలలిత నెచ్చెలి వీకే శశికళ జైలు జీవితం నేటితో ముగియనుంది. అవినీతి కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించిన ఆమెను ఈరోజు విడుదల చేయనున్నారు. ఇందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఆస్పత్రిలోనే పూర్తి చేయనున్నట్లు జైలు అధికారులు తెలిపారు. కరోనా బారిన పడ్డ శశికళ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విడుదలైన తర్వాత కూడా ఆమె ఆస్పత్రిలోనే ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.
 
జనవరి 20న శశికళకు కరోనా సోకింది. ప్రస్తుతం విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెను ఎప్పుడు డిశ్ఛార్జి చేస్తారనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఆస్పత్రి వర్గాలతో చర్చించి డిశ్ఛార్జిపై నిర్ణయం తీసుకుంటామని శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్​ తెలిపారు. 
 
ప్రస్తుతం శశికళ ఆరోగ్యం మెరుగ్గానే ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కరోనా లక్షణాలు ఏవీ లేవని వెల్లడించారు. కరోనా మార్గదర్శకాల ప్రకారం ఇంకో పది రోజులు ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

Sri Vishnu : ప్రతి యువకుడి కథ.. ట్యాగ్‌లైన్‌తో శ్రీవిష్ణు హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

Rashmika: రష్మిక తో బోల్డ్ సినిమా తీశా - రేటింగ్ ఒకటిన్నర ఇస్తారేమో : అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments