Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయ అంత్యక్రియలకు కూడా ముహూర్తం.. రాహుకాలం దాటాక సాయంత్రం 4.30 గంటలకు?

తమిళనాడు సీఎం జయలలితకు దైవభక్తి ఎక్కువ. జ్యోతిష్య మంటే మరింత విశ్వాసం. న్యూమరాలజీపైనా అంతే నమ్మకం. ఇలా సెంటిమెంట్లను బలంగా నమ్మిన జయలలిత ఆరు భాషల్లో 127 సినిమాల్లో నటించి.. రాజకీయాల్లో ఉన్నత స్థానాన్న

Webdunia
మంగళవారం, 6 డిశెంబరు 2016 (13:45 IST)
తమిళనాడు సీఎం జయలలితకు దైవభక్తి ఎక్కువ. జ్యోతిష్య మంటే మరింత విశ్వాసం. న్యూమరాలజీపైనా అంతే నమ్మకం. ఇలా సెంటిమెంట్లను బలంగా నమ్మిన జయలలిత ఆరు భాషల్లో 127 సినిమాల్లో నటించి.. రాజకీయాల్లో ఉన్నత స్థానాన్ని కైవసం చేసుకున్న జయలలితకు రాహుకాలంలో ఎలాంటి పనిచేయరు.

కొన్ని కారణాల వల్ల జైలుకు వెళ్లిన జయ తిరిగి అధికారంలోకి రావాలని తంజావూరులోని కాళి ఆలయంలో యజ్ఞం చేయించినప్పుడు తన పేరులో మరో అక్షరాన్ని పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తన పుట్టినతేదీ ప్రకారం 5, 7 అంకెలతో మంచి జరుగుతుందనేది ఆమె నమ్మకం. అలాంటిది 75 రోజులు చావుబతుకుల మధ్య పోరాడిన జయలలిత సోమవారం.. అంటే డిసెంబర్‌ 5న తుదిశ్వాస విడవడం యాదృచ్ఛికం. ఆమె నమ్మకాన్ని గౌరవిస్తూ అంతిమ యాత్ర కూడా రాహుకాలం దాటాక సాయంత్రం 4.30 గంటల తర్వాత ఏర్పాటు చేశారు.
 
జ్యోతిష్కులను సంప్రదించనిదే ఏ నిర్ణయం కూడా తీసుకునేవారు కాదు. చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని నిర్ణయాలను పంచాంగాన్ని బట్టి తీసుకునేవారు. సీఎంగా  జయలలిత ఏ పథకాన్ని ప్రారంభించినా ముందు జ్యోతిష్కులను సంప్రదించేవారు. వారి సలహాల ప్రకారం తేదీ, సమయాన్ని నిర్ణయించేవారు.

ముహూర్తం సరిగాలేదని చివరి నిమిషంలో తెలియడంతో జయలలిత ఓ సారి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసుకున్నారు. దీన్ని బట్టి ఆమెకు జ్యోతిషంపై ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. 2001లో జయలలిత తన పేరులో అదనంగా ఇంగ్లీష్‌ అక్షరం 'ఏ' చేర్చుకున్నారు. ఇంగ్లీషులో 11 అక్షరాలున్న (Jayalalitha) తన పేరును 12 అక్షరాలు వచ్చేలా Jayalalithaaగా మార్చుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments