Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై అపోలో ఆస్పత్రి నర్సులకు బ్యూటీ టిప్స్ చెప్పిన జయలలిత

చెన్నై గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆస్పత్రి నర్సులకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బ్యూటీ టిప్స్ చెప్పారు. దీంతో వారు ఉప్పొంగి పోయారు. సెప్టెంబర్ 22వ తేదీన జ్వరం, డీహైడ్రేషన్ కారణంగా ఈ ఆస్పత్రిలో చేరిన జయ

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2016 (14:54 IST)
చెన్నై గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆస్పత్రి నర్సులకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బ్యూటీ టిప్స్ చెప్పారు. దీంతో వారు ఉప్పొంగి పోయారు. సెప్టెంబర్ 22వ తేదీన జ్వరం, డీహైడ్రేషన్ కారణంగా ఈ ఆస్పత్రిలో చేరిన జయలలిత... 74 రోజుల పాటు చికిత్స పొందుతూ.. గుండె పోటు రావడంతో సోమవారం అర్థరాత్రి కన్నుమూసిన విషయం తెల్సిందే. 
 
ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందే సమయంలో డ్యూటీ డాక్టర్లతో పాటు తనకు వైద్య సేవలు అందించిన నర్సులతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారనే వార్తలు వస్తున్నాయి. జయలలితకు నర్సింగ్ సేవలు అందించిన షీలా అనే నర్సు మాట్లాడుతూ తమను చూడగానే జయలలిత నవ్వేవారని, తమతో మాట్లాడేవారని, చాలా సార్లు తమకు సహకరిస్తూ వచ్చారని తెలిపింది.
 
పోయెస్ గార్డెన్‌లో కుక్ తనకు ఇష్టమైన వంటకాలు ఎలా చేసేవారో జయలలిత చెప్పినట్లు షీలా చెప్పారు. వాటిలో ఉప్మా, పొంగల్ లేదా కర్డ్ రైస్, పొటాటో కర్రీ ఉండేవట. తాము ఉన్నప్పుడు ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించేవారని, అతి కష్టంగానైనా సరే తినడానికి ప్రయత్నించేవారని ఆమె చెప్పారు.
 
ఉల్లాసంగా ఉన్న సమయంలో నర్సులకు స్కిన్ కేర్ చిట్కాలు చెప్పేవారట. హెయిర్ స్టయిల్ మార్చుకోవాలని వారికి ఆదేశాలు కూడా ఇచ్చారట. ఎంత తీరిక లేకుండా ఉన్నా సరే తమకోసం తాము కొంత సమయం కేటాయించుకోవాలని చెప్పేవారని మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సత్యభామ చెప్పినట్లు జాతీయ పత్రిక రాసింది.
 
అస్పత్రి సిబ్బందికి ఎప్పుడూ గుర్తుండి పోయే జ్ఞాపకం కూడా ఉంది. తన ఇంటికి విందుకు రావాలని మెడికల్ టీమ్ అంతటినీ జయలలిత ఆహ్వానించారట. ఆమెకు అపోలోలో కాఫీ నచ్చలేదట. మా ఇంటికి రండి, కొడైనాడుకు చెందిన బెస్ట్ టీని మీకు ఇస్తాను అని చెప్పారని డాక్టర్ రమేష్ వెంకటరామన్ చెప్పినట్లు జాతీయ పత్రిక రాసింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments