Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక వార్డుకు జయలలిత.. మరికొద్ది రోజులు 15 రోజులు ఆస్పత్రిలోనే...

గత కొన్ని రోజులుగా చెన్నై అపోలో ఆస్పత్రిలోని సీసీయులో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ప్రత్యేక వార్డుకు మార్చారు. ఇప్పటివరకు సీసీయూ విభాగంలో ఆమెకు దేశవిదేశీ వైద్యుల పర్యవేక్షణలో చికిత

Webdunia
గురువారం, 10 నవంబరు 2016 (09:43 IST)
గత కొన్ని రోజులుగా చెన్నై అపోలో ఆస్పత్రిలోని సీసీయులో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ప్రత్యేక వార్డుకు మార్చారు. ఇప్పటివరకు సీసీయూ విభాగంలో ఆమెకు దేశవిదేశీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్సనందించారు. ఆమె కోలుకున్నారని, ద్రవాహారం అందిస్తున్నామని, స్వయంగా శ్వాసపీల్చుకుంటూ చికిత్సకు స్పందిస్తున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపిన సంగతి తెలిసిందే. 
 
దీంతో ఆమెను ఐసీయూ నుంచి 'ఎల్' అనే వీఐపీ వార్డుకు తరలించినట్లు అపోలో ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. నెలకుపైగా వెంటిలేటర్‌ పై ఉన్న ఆమె క్రమక్రమంగా సహజసిద్ధంగా శ్వాస పీల్చుకోగలుగుతుండటంతో, తన చుట్టూ ఏం జరుగుతుందో ఆమె అర్థం చేసుకోగలుగుతున్నారని, తనకు ఆసుపత్రి వర్గాలు అందిస్తున్న చికిత్స వివరాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. 
 
మరోవైపు... తమ పార్టీ అధినేత్రి ప్రైవేట్ వార్డుకు మార్చడంతో అన్నాడీఎంకే శ్రేణులు ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తున్నారు. తాము చేస్తున్న పూజలు, హోమాలతో తమ అమ్మ సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిష్ వెంకట్ కుటుంబానికి నేనున్నా.. రూ.1.5 లక్షలు ఇచ్చిన సోనూ సూద్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments