Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ అంత్యక్రియల్లో జేబుదొంగల చేతివాటం.. చితక్కొట్టిన ప్రజలు

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత అంత్యక్రియల్లో జేబుదొంగలు తమ చేతివాటాన్ని బాగానే ప్రదర్శించారు. ఫలితంగా అనేక మంది తమ వస్తువులను పోగొట్టుకున్నారు.

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2016 (09:30 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత అంత్యక్రియల్లో జేబుదొంగలు తమ చేతివాటాన్ని బాగానే ప్రదర్శించారు. ఫలితంగా అనేక మంది తమ వస్తువులను పోగొట్టుకున్నారు. ఈ జేబుదొంగలు జేబుల్లోని పర్సులను నొక్కేస్తూ... ప్రజలకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఇలాంటివారిని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. 
 
సోమవారం రాత్రి కన్నుమూసిన జయలలిత అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం జరిగిన విషయం తెల్సిందే. తమ నాయకురాలికి తుది వీడ్కోలు పలికేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జనం విషాదంలో మునిగిపోయారు. ఇదే అదునుగా భావించిన సురేష్, దినేష్‌లతో పాటు.. మరికొందరు దొంగలు పలువురి నుంచి సెల్ ఫోన్లు, నగదును దోచుకున్నారు. 
 
జయలలిత పార్థీవదేహం ఉంచిన రాజాజీ హాలు నుంచి మెరీనా బీచ్ వరకు ఈ దొంగలు పలు చోరీలు చేశారు. చోరీలు చేస్తూ తోడు దొంగలు ప్రజలకు రెడ్ హ్యాండెడ్‌గా దొరకడంతో వారిని పోలీసులకు అప్పగించారు. దొంగల నుంచి రూ.30 వేల నగదుతోపాటు 10 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరిని వేలూరు జిల్లా గుడియాత్తం వాసులుగా గుర్తించారు. వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని యజమానులకు అప్పగిస్తామని చెప్పారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments