Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిడ్నీ - మధుమేహం సమస్యలతో జయలలిత... సింగపూర్‌కు తరలించే యోచనలో వైద్యులు

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెకు మెరుగైన వైద్య సేవలు అందించే నిమిత్తం సింగపూర్‌కు తరలించాలన్న యోచనలో వైద్యులు ఉన్నట్టు సమాచారం.

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2016 (12:37 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెకు మెరుగైన వైద్య సేవలు అందించే నిమిత్తం సింగపూర్‌కు తరలించాలన్న యోచనలో వైద్యులు ఉన్నట్టు సమాచారం. 
 
రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురైన జయలలితను ప్ర‌స్తుతం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే, గత రెండు రోజులుగా ఆమె ఆరోగ్య పరిస్థితిలో ఏమాత్రం మెరుగుపడక పోవడంతో ఆమెను సింగ‌పూర్ త‌ర‌లించాలని యోచిస్తున్నారు. 
 
జ‌య‌ల‌లిత‌కు మధుమేహం, కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా ఉండటంతో మ‌రింత మెరుగైన చికిత్సను అందించ‌డం కోసం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆసుప‌త్రి వ‌ర్గాలు మీడియాకు తెలిపాయి. ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉందని, జ్వ‌రం త‌గ్గింద‌ని చెప్పారు. ముఖ్య‌మంత్రికి సాధార‌ణ ఆహారాన్నే ఇస్తున్న‌ట్లు పేర్కొన్నాయి. 
 
మరోవైపు జ‌య‌ల‌లిత అభిమానులు, అన్నాడీఎంకే కార్య‌క‌ర్త‌లు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుతూ త‌మిళ‌నాడులోని పలు దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. ఆసుప‌త్రి వ‌ద్దకు వారు చేరుకుంటున్నారు. జయలలిత త్వ‌ర‌గా కోలుకోవాలని తాను ఆశిస్తున్నట్లు తెలుపుతూ ప్రధాని మోడీ ఆమెకు బొకే పంపించారు. అందుకు జ‌య‌ల‌లిత స్పందిస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్న‌ట్లు లేఖ రాశారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments