Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత బతికే అవకాశాలు 50 : 50 !!? ... గాల్లో దీపంలా అమ్మ ప్రాణాలు

అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రాణాలు గాల్లో దీపంలా ఉన్నాయి. ఆమె బతికే అవకాశాలు ఫిప్టీఫిప్టీగా ఉన్నట్టు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆదివారం సాయంత్రం తీవ్రమైన గుండెపోటుకు

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2016 (14:15 IST)
అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రాణాలు గాల్లో దీపంలా ఉన్నాయి. ఆమె బతికే అవకాశాలు ఫిప్టీఫిప్టీగా ఉన్నట్టు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆదివారం సాయంత్రం తీవ్రమైన గుండెపోటుకు గురైన జయలలితకు 'ఈసీఎంవో' (ఎక్మో) ఏర్పాటు చేశామని చెన్నైలోని ఆపోలో ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈసీఎంవో అంటే ఎక్‌స్ట్రాకార్పోరియల్ మెబ్రేన్ ఆక్సిజెనేషన్. శారీరక ధర్మాలను గుండె, ఊపిరితిత్తులు నిర్వహించలేక పోయినప్పుడు ఈ యాత్రిక వ్యవస్థ ద్వారా వాటి విధులను నిర్వహింపజేస్తారు. రోగికి అత్యంత ప్రాణాపాయం ఉన్నప్పుడు మాత్రమే ఈ యాంత్రిక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఇందులో రోగి బతికే అవకాశాలు ఫిఫ్టీ, ఫిఫ్టీ మాత్రమే ఉంటాయని పలువురు హృద్రోగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 
ఈ ఈసీఎంవో వ్యవస్థపై రోగులు కొన్ని రోజులు లేదా కొన్ని వారాలు కూడా జీవించే అవకాశం ఉంటుంది. ఏ రకంగాను వైద్యానికి రోగి శరీరం స్పందించకపోయిన పరిస్థితుల్లో చివరి అవకాశంగా మాత్రమే ఈ వ్యవస్థ ద్వారా చికిత్స అందిస్తారని వారు చెపుతున్నారు. శరీర రక్తనాళాల నుంచి రక్తాన్ని గ్రహించే ఈ పరికరం, ఆ రక్తాన్ని తిరిగి గుండే, ఊపిరితిత్తుల ద్వారా శరీరం అంతటికి ప్రవహించేలా చేస్తోంది. ఈ ప్రక్రియలో కార్బన్ డై  ఆక్సైడ్‌ను తొలగించి రక్త కణాలకు అవసరమైన ఆక్సిజన్ కూడా అందిస్తుంది. సాధారణంగా ఈ ఈసీఎంఓను ప్రముఖలకు మాత్రమే ఏర్పాటు చేస్తుంటారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments