Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత ఆభరణాలు : 21 కేజీల బంగారం.. వజ్రాలు... 500 వైన్ గ్లాస్‌లు ఎవరికి సొంతం?

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో చిక్కుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ నెలకు ఒక్క రూపాయి వేతనం తీసుకుంటూ భారీ మొత్తంలో అక్రమాస్తులు కూడబెట్టారన్నది ప్రధాన అభియోగం.

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2016 (15:20 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో చిక్కుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ నెలకు ఒక్క రూపాయి వేతనం తీసుకుంటూ భారీ మొత్తంలో అక్రమాస్తులు కూడబెట్టారన్నది ప్రధాన అభియోగం. ఈ కేసు విచారణ ఇప్పటికీ సాగుతోంది. అయితే, ఈ కేసులో ప్రధాన ముద్దాయి జయలలిత కావడం, ఆమె ఇపుడు చనిపోవడంతో ఈ కేసు ఇంతటితో ముగిసే అవకాశం ఉంది. 
 
అయితే, ఆమెకు సొంతమైన చీరలు, ఖరీదైన చెప్పుల జతలు వంటివి ఇప్పటికీ కర్ణాటక కోర్టుల కస్టడీలో ఉన్నాయి. దీంతో ఇవన్నీ ఇప్పుడు ఎవరికి చెందుతాయి? అనే ప్రశ్న తలెత్తుతోంది. త్వరలోనే సుప్రీంకోర్టు దీనిపై తీర్పు వెలువరించి ఆ ఆస్తులను రిలీజ్ చేస్తుందని, జయ స్మారకార్థం ఏర్పాటు చేసే మ్యూజియంలో వాటిని ప్రదర్శన కోసం ఉంచే అవకాశాలుంటాయని అన్నాడీఎంకే సీనియర్ నేతలు అంటున్నారు. 
 
వాస్తవానికి 1996లో ఆదాయం పన్ను అధికారులు స్వాధీనం చేసుకున్న ఆస్తులు ప్రస్తుతం కర్ణాటక పోలీసుల సంరక్షణలో ఉన్నాయి. ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్న 10,500 చీరలు, 750 చెప్పుల జతలు, 500 వైన్ గ్లాసులతో పాటు.. 3.5 కోట్ల రూపాయలు విలువచేసే 21.28 కేజీల స్వర్ణాభరణాలు, 1.250 కేజీల వెండి వస్తువులు, 2 కోట్ల రూపాయలు విలువచేసే వజ్రాలు, వెండి కత్తి వంటివి ఉన్నట్టు సమాచారం. 
 
బెంగుళూరు సిటీ సివిల్ కోర్టు మొదటి అంతస్థులోని ఒక గదిలో భద్రపరిచారు. వీటికి నలుగురు పోలీసులు షిఫ్టుల వారిగా కాపలా ఉన్నారు. ఈ కేసు తమిళనాడు నుంచి కర్ణాటకకు బదలీ కావడంతో 2002లో ఈ వస్తువులన్నింటినీ ఐటి అధికారులు కర్ణాటక ప్రభుత్వానికి అప్పగించారు. అయితే ఆ గదిలో ఏమున్నాయనేది తమకు తెయదని సాయుధ రిజర్వ్ పోలీసులు చెబుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments