Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ అవమానమే.. అమ్మకు బలమైంది.. ఎంజీఆర్ మృతదేహం తల భాగాన నిలబడి?

తమిళనాడు సీఎం జయలలిత సెప్టెంబర్ 22వ తేదీన తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్, శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. డిసెంబర్ నాలుగో తేదీ జయకు తీవ్రమైన గుండెపోటు.. ఐసీయూలో చికిత్స అం

Webdunia
మంగళవారం, 6 డిశెంబరు 2016 (08:21 IST)
తమిళనాడు సీఎం జయలలిత సెప్టెంబర్ 22వ తేదీన తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్, శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. డిసెంబర్ నాలుగో తేదీ జయకు తీవ్రమైన గుండెపోటు.. ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని అపోలో ఆస్పత్రి ప్రకటించింది. దీంతో అమ్మ ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన మొదలైంది.

అలాగే డిసెంబర్ 5న  జయలలిత ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. వైద్యులు తమ శాయశక్తులా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. చివరకు సోమవారం రాత్రి మరణించినట్లు ప్రకటించేశారు. దీంతో తమిళనాట అమ్మ అంటూ పిలువబడే జయలలిత ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 
 
అమ్మ గొంతు.. అమ్మ ధైర్యం మంటగలిసిపోయింది. అన్నాడీఎంకే కార్యకర్తలు డీలా పడిపోయారు. ఈ క్రమంలో అన్నాడీఎంకే నేతలు జయలలితకు కలిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 1987లో ఎంజీఆర్‌ మరణం జయలలితకు బాధతోపాటు అవమానాన్నీ మిగిల్చింది. ఎంజీఆర్‌ సతీమణి జానకి మద్దతుదారులు జయపై దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకున్నంత పనిచేశారు. ఆ ఘటనే అమ్మలో వైరాగ్యాన్ని పెంచిందంటున్నారు. ఇంకా ఆ అవమానంతోనే అమ్మ విప్లవ నాయకి నుంచి అమ్మగా ఎదిగిపోయారని అంటున్నారు. 
 
1987లో ఎంజీఆర్‌ మృతదేహం తల భాగాన నిలబడి వున్న జయను ఈడ్చుకుంటూ బయటకు గెంటేశారని అన్నాడీఎంకే వర్గాలు గుర్తు చేసుకుంటుంటాయి. ఈ సంఘటన ఆమెపై ఎంతో ప్రభావం చూపిందని.. ఈ ఘటనను ఆసరాగా తీసుకుని ఆసరాగా తీసుకుని జానకికి వ్యతిరేకంగా అమ్మ ప్రజాసానుభూతి పొందేందుకు ఎత్తుగడ వేశారు. అందులో ఆమె సక్సెస్ అయ్యారు.
 
తనకంటూ ప్రత్యేక బలాన్ని కూడగట్టుకోవడం మొదలు పెట్టారు. ఫలితంగా అన్నాడీఎంకేలో జానకి ప్రభావం తగ్గి పార్టీ మొత్తం జయ చేతుల్లోకి వచ్చేసింది. 1991లో ఎన్నికల్లో అన్నాడీ ఎంకే విజయపథాన నడిపి ముఖ్యమంత్రి అయ్యారు. తద్వారా తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అతి పిన్నవయస్కురాలిగా గుర్తింపు పొందారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments