చంద్రబాబుకు ముడుపులు అందాయి.. ఆధారాలున్నాయ్: జైరామ్ రమేష్(వీడియో)

పోలవరం ప్రాజెక్టు పనులు నిధుల్లేక ముందుకు సాగట్లేదని.. కేంద్ర ప్రభుత్వం సత్వరమే నిధులను విడుదల చేయాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మొత్తుకుంటున్న నేపథ్యంలో.. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జైరాం రమే

Webdunia
శనివారం, 17 ఫిబ్రవరి 2018 (17:45 IST)
పోలవరం ప్రాజెక్టు పనులు నిధుల్లేక ముందుకు సాగట్లేదని.. కేంద్ర ప్రభుత్వం సత్వరమే నిధులను విడుదల చేయాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మొత్తుకుంటున్న నేపథ్యంలో.. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. పోలవరం విషయంలో చంద్రబాబు ముడుపులు తీసుకున్నట్లు తమ వద్ద ఆధారాలున్నాయని జైరామ్ రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల కోసం విదేశాల్లో ఆయన ముడుపులు అందాయని జైరామ్ రమేష్ తెలిపారు. 
 
నాలుగేళ్ల పరిపాలనలో తెలుగుదేశం పార్టీ కేవలం పునాది రాళ్లకే పరిమితమైందని జైరామ్ రమేష్ ఎద్దేవా చేశారు. విభజన హామీలకు సంబంధించి దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాటకాలాడుతున్నారని జైరామ్ రమేష్ ఆరోపించారు.
 
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయిన తర్వాత ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని చెప్పారు. ఏపీ విభజన శాస్త్రీయంగా జరుగలేదని చెప్తున్న బీజేపీ.. పార్లమెంట్‌తో పూర్తి మెజారిటీ కలిగి వున్నందున చట్టంలో మార్పు చేయవచ్చు కదా అంటూ జైరామ్ రమేష్ నిలదీశారు. వీడియో చూడండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments