Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులకు లంచమిచ్చి భార్యలు - ప్రియురాళ్లతో ఖైదీల రాసలీలు!

ఠాగూర్
సోమవారం, 26 మే 2025 (18:56 IST)
వైద్య పరీక్షల కోసం జైలు నుంచి ఆస్పత్రికి వెళ్లిన కొందరు ఖైదీలు.. తమకు ఎస్కాట్‌గా పోలీసులకు లంచమిచ్చి.. తమ భార్యలు, ప్రియురాళ్లతో ఏకాంతంగా గడిపిన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. పోలీసుల అనుమతితో వెళ్లిన ఖైదీలు.. సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో విచారణ జరుపగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జైపూర్ సెంట్రల్ జైలు నుంచి శనివారం రఫీక్ బక్రి, భన్వర్ లాల్, అంకిత్ బన్సాల్, కరణ్ గుప్తా అనే నలుగురు ఖైదీలను కానిస్టేబుళ్లు వైద్య పరీక్షల కోసం బయటకు తీసుకెళ్లారు. ఇదే అదనుగా భావించిన ఖైదీలు గార్డులకు ఒక్కొక్కరికీ రూ.5 వేలు చొప్పున లంచం ఇస్తామని, తమను సాయంత్రం వరకు బయట వదిలేయాల్సిందిగా కోరారు. దీనికి అంగీకరించిన కానిస్టేబుళ్లు వారిని వదిలివేశారు. బయటకు వెళ్లిన ఖైదీలు సాయంత్రమైన తిరిగి రాకపోవడంతో అధికారుల వారి కోసం గాలిస్తుండగా, ఓ హోటల్‌లో రఫీక్ తన భార్యతో, భన్వర్ తన మాజీ ప్రియురాలితో ఉన్నట్టు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. 
 
మరో ఇద్దరు ఖైదీలైన అంకిత్, కరణ్ విమానాశ్రయానికి సమీపంలోని ఒక హోటల్‌లో ఉండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారుప. కరణ్‌తో పాటు ఉన్న అతడి బంధువు వద్ద అనేక మంది ఖైదీల ఐడీ కార్డులు, రూ.45 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments