Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొనసాగుతున్న ఐటీ సోదాలు... శశికళ వంద బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్

అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ, ఆ పార్టీ బహిష్కృత నేత టీటీవీ దినకరన్‌లతో పాటు.. ఆయన కుటుంబ సభ్యులు, అనుచరుల గృహాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు ఐదో రోజు కూడా సోదాలు కొనసాగిస్తున్నారు.

Webdunia
సోమవారం, 13 నవంబరు 2017 (12:36 IST)
అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ, ఆ పార్టీ బహిష్కృత నేత టీటీవీ దినకరన్‌లతో పాటు.. ఆయన కుటుంబ సభ్యులు, అనుచరుల గృహాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు ఐదో రోజు కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. అంటే, గత ఐదు రోజులుగా మన్నార్గుడి మాఫియాను లక్ష్యంగా చేసుకుని ఈ సోదాలు కొనసాగుతున్నాయి. 
 
పెద్ద నోట్ల రద్దు సమయంలో వీరంతా భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడటమే కాకుండా, భారీ మొత్తంలో పన్ను ఎగవేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు సాగుతున్న విషయం తెల్సిందే. ఈ దాడుల్లో శశికళకు చెందిన సంస్థల్లో కోట్లాది రూపాయల అక్రమాలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో 20 డొల్ల కంపెనీలకు డబ్బులు తరలించినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. 
 
ఇందుకు సంబంధించిన వంద బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. తొలిరోజు దాడుల్లో సుమారు వెయ్యి కోట్ల మేర పన్ను ఎగవేతకు పాల్పడినట్టు గుర్తించిన సంగతి తెలిసిందే. రెండో రోజు దాడుల్లో వజ్రవైఢూర్యాలు, బంగారు, వెండ సంపదను గుర్తించినట్టు వార్తలు వెలువడ్డాయి. ఇక మూడవరోజు పలు స్తిరాస్థులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments