చంద్రయాన్-4కు సిద్ధమవుతున్న ఇస్రో

Webdunia
శనివారం, 18 నవంబరు 2023 (17:29 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇటీవల జరిపిన చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అయింది. దీంతో ఇపుడు చంద్రయాన్-4కు సిద్ధమవుతుంది. చంద్రుడిపై నుంచి శాంపిల్స్ తీసుకునిరావడం పై ఇస్రో పని చేస్తుంది. వచ్చే ఐదు లేదా ఏడు సంవత్సరాల్లో మిషన్ చేపడుతామని ఇస్రో శాస్త్రవేత్త నీలేశ్ దేశాయ్ వెల్లడించారు.
 
కాగా, చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ తర్వాత ఇస్రో మరో భారీ మిషన్లకు సిద్ధమవుతుంది. లాపెక్స్, చంద్రయాన్-4 మిషన్లకు సిద్ధమవుతుంది. ఈ మిషన్ల ద్వారా 350 కేజీల ల్యాండర్‌ను 90 డిగ్రీల ప్రాంతం (చీకటి వైపు)లో ల్యాండ్ చేయడానికి, శాంపిల్స్‌ను సేకరించి తిరిగి తీసుకొచ్చే మిషన్ ప్రయోగాల కోసం ప్రస్తుతం పని చేస్తున్నట్టు అహ్మదాబాద్‌లో ఉన్న స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ దేశాయ్ వెల్లడించారు. 
 
చంద్రయాన్-4 మిషన్ ద్వారా చంద్రుడిపై దిగిన తర్వాత సెంట్రల్ మాడ్యుల్ అక్కడ నుంచి శాంపిల్స్‌ని వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు వచ్చే ఐదు లేదా ఏడేళ్ళలో చేపడుతామని ఆయన పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments