Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎస్ఎల్వీ-సీ38 ప్రయోగానికి సర్వం సిద్ధం... మరికొన్ని గంటల్లో....

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సంస్థ మరో ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పీఎస్ఎల్వీ-సీ38ను నింగిలోకి పంపించనుంది. దీనిద్వారా మరో 31 ఉపగ్రహాలను నింగిలోకి పంపుతుంది. ఈ మేరకు అన్ని ఏర్పా

Webdunia
గురువారం, 22 జూన్ 2017 (10:12 IST)
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సంస్థ మరో ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పీఎస్ఎల్వీ-సీ38ను నింగిలోకి పంపించనుంది. దీనిద్వారా మరో 31 ఉపగ్రహాలను నింగిలోకి పంపుతుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 160 కోట్ల రూపాయల వ్యయంతో ఇస్రో ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఇందుకోసం ఇస్రోకు అత్యంత విశ్వాసపాత్రమైన పోలార్‌ ఉపగ్రహ వాహకనౌక (పీఎస్‌ఎల్‌వీ)- సీ38ను రూపొందించారు. 
 
దీంతో కార్టోశాట్‌-2ఇ ఉపగ్రహంతో పాటు తమిళనాడులోని నూరుల్‌ ఇస్లాం విశ్వవిద్యాలయం విద్యార్థులు రూపొందించిన ఉపగ్రహాన్ని, అలాగే ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌ సహా మరో 8 దేశాలకు చెందిన 31 ఉపగ్రహాలను 505 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి ధ్రువ సూర్య అనువర్తిత కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.
 
ఈ ఉపగ్రహవాహక నౌక ద్వారా నింగిలో ప్రవేశపెట్టనున్న కార్టోశాట్-2ఇ బరువు 712 కేజీలు కాగా, మిగిలిన 30 నానో ఉపగ్రహాల బరువు కేవలం 243 కేజీలు కావడం విశేషం. ఈ మేరకు కౌంట్ డౌన్ గురువారం ఉదయం 5.08 నిమిషాలకు ప్రారంభమైంది. కౌంట్ డౌన్ ప్రారంభమైన 28 గంటల అనంతరం నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం-షార్‌ నుంచి ప్రయోగం జరగనుంది. శుక్రవారం ఉదయం 9.29 నిమిషాలకు జరగనున్న ఈ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు సినిమా కోసం కపిల్ శర్మ ఆడిషన్‌ చేస్తున్నారా?

Karishma Sharma: ముంబై లోకల్ రైలు నుంచి దూకిన బాలీవుడ్ నటి కరిష్మా శర్మ

Lavanya: లావణ్య త్రిపాఠి కి అభినందనలు - అథర్వ మురళి టన్నెల్ మూవీ వాయిదా

లిటిల్ హార్ట్స్ మూవీకి సపోర్ట్ చేస్తూ ప్రోత్సాహం అందిస్తున్న స్టార్స్

ఏడాదిలో మరింత వినోదాన్ని, అనుభూతిని ఇచ్చేందుకు రెడీగా సోనీ లివ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coconut Milk: జుట్టు ఆరోగ్యానిరి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

తర్వాతి కథనం