Webdunia - Bharat's app for daily news and videos

Install App

సార్క్ మిత్రదేశాలకు ప్రధాని మోడీ గిఫ్ట్.... నింగిలోకి జీఎస్‌ఎల్వీ ఎఫ్-9 ఉపగ్రహం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శుక్రవారం ప్రయోగించిన జీఎస్‌ఎల్వీ ఎఫ్‌-09 రాకెట్‌ విజయవంతంగా కక్ష్యలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని షార్ సెంటర్ ప్రయోగ కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించారు. జీఎస్‌ఎల్

Webdunia
శుక్రవారం, 5 మే 2017 (18:05 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శుక్రవారం ప్రయోగించిన జీఎస్‌ఎల్వీ ఎఫ్‌-09 రాకెట్‌ విజయవంతంగా కక్ష్యలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని షార్ సెంటర్ ప్రయోగ కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించారు. జీఎస్‌ఎల్వీ సిరీస్‌లో ఇది 11వ రాకెట్‌ ప్రయోగం. 2230 కేజీల జీశాట్‌ 9 ఉపగ్రహాన్ని  అనుకున్నట్టుగా రోదసీలోకి చేర్చారు. జీశాట్‌ 9లో 12 ట్రాన్స్‌పాండర్లు, జీవితకాలం 12 ఏళ్లుగా అధికారులు పేర్కొన్నారు. ఇస్రో కెరీర్‌లో స్వదేశీ క్రయో ఇంజిన్‌ ద్వారా నింగిలోకి చేర్చే అతి బరువైన ఉపగ్రహం జీశాట్‌ 09గా ఇస్రో పేర్కొంది. ఈ ఉపగ్రహం పాకిస్థాన్ మినహా మిగిలిన సార్క్ దేశాలకు 12 ఏళ్ళపాటు తన సేవలను అందించనుంది. 
 
జీఎస్‌ఎల్వీ ఎఫ్-09 ఉపగ్రహానికి గురువారం కౌంట్‌డౌన్ ప్రారంభం కాగా, శుక్రవారం సాయంత్రం పూట శ్రీహరికోట నుండి ఈ ఉపగ్రహన్ని విజయవంతంగా ప్రయోగించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచనతో సార్క్ దేశాలకు ప్రయోజనం కల్పించేందుకుగాను ఈ ఉపగ్రహాన్ని ఇస్రో రూపొందించింది. ఈ ఉపగ్రహం భారత్‌తో పాటు దక్షిణాసియా దేశాలకు సేవలను అందించనుంది. అయితే ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యానికి పాకిస్థాన్ అంగీకరించలేదు. మిగిలిన దక్షిణాసియా దేశాలైన శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, భారత్, మాల్దీవులకు ఈ ఉపగ్రహం 12 ఏళ్ళపాటు సేవలను అందించనుంది. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments