Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎస్ఎల్వీ-సీ-42 ప్రయోగం.. ముహూర్తం రాత్రి 10.08 గంటలు

పీఎస్ఎల్వీ-సీ-42 ఉపగ్రహ వాహన నౌకను నింగిలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర

Webdunia
ఆదివారం, 16 సెప్టెంబరు 2018 (15:12 IST)
పీఎస్ఎల్వీ-సీ-42 ఉపగ్రహ వాహన నౌకను నింగిలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో పీఎస్ఎల్వీ-సీ-42 ప్రయోగం జరుగనుంది. ఆదివారం (సెప్టెంబర్-16) రాత్రి పది గంటల 8 నిమిషాలకు పీఎస్ఎల్వీ-సీ-42 ఉపగ్రహ నౌకను నింగిలోకి ప్రవేశపెడతారు.
 
ఇది పూర్తిగా వాణిజ్యపరమైన ప్రయోగమని.. దీని ద్వారా బ్రిటన్‌కు చెందిన 889 కిలోల బరువైన నోవాసర్, S1-A ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెడతామని శాస్త్రవేత్తలు తెలిపారు. వీటికి సర్వే శాటిలైట్ టెక్నాలజీ లిమిటెడ్ సంస్థ రూపకల్పన చేసింది. పీఎస్ఎల్వీ-సీ-42 ప్రయోగంలో భాగంగా శనివారం మధ్యాహ్నం 1.08 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 
 
ఆదివారం రాత్రి 10.07కు ప్రయోగాన్ని నిర్వహించాలని మొదట నిర్ణయించినా వర్షం పడే అవకాశముండటంతో రాకెట్ వెళ్లే గమనంలోని అంతరిక్ష వ్యర్ధాలను తప్పించుకునేందుకు ఒక నిమిషం పొడిగించి ప్రయోగ సమయాన్ని 10.08గా నిర్ణయించారు. ఇక 33గంటల కౌంట్ డౌన్‌లో భాగంగా ఇస్రో శాస్త్రవేత్తలు శనివారం రాత్రి రాకెట్‌ను నాలుగో దశలో ద్రవ ఇంధనం నింపి పరిశీలించారు. 
 
ఆదివారం తెల్లవారు జామున రెండో దశలో ద్రవ ఇందనం నింపే ప్రక్రియను పూర్తి చేశారు. ఇవాళ తుది విడత తనిఖీల తర్వాత పీఎస్ఎల్వీ-సీ-42 ఉపగ్రహ వాహక నౌకను ప్రయోగించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments