Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రుడి ఉపరితల ఫోటోలు రిలీజ్ చేసిన ఇస్రో

Webdunia
ఆదివారం, 6 అక్టోబరు 2019 (14:32 IST)
చంద్రుడి ఉపరితల ఫొటోలను ఇస్రో విడుదల చేసింది. చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌లో అమర్చిన ఆర్బిటర్‌ హై రెసొల్యూషన్‌ కెమెరా (ఓహెచ్‌ఆర్‌సీ).. చంద్రుడి ఉపరితలానికి 100 కిలోమీటర్ల దూరం నుంచి ఈ ఫొటోలు తీసింది. 
 
సుమారు 14 కిలోమీటర్ల వ్యాసం, మూడు కిలోమీటర్ల లోతు ఉన్న ఈ లోయను ఆర్బిటర్‌ తన చిత్రాల్లో బంధించింది. దక్షిణ ధ్రువానికి సమీపంలో ఉన్న ఈ లోయ చిత్రాల్లో పెద్ద పెద్ద రాళ్ల వంటి నిర్మాణాలతో పాటు చిన్న గుంతల్లాంటివి ఉన్నాయని ఇస్రో తెలిపింది.
 
శనివారం తెల్లవారుజామున 4:38 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువంలోని బోగస్లాస్కై బిలం పరిసరాలను వంద మీటర్ల దూరం నుంచి ఆర్బిటర్ ఫొటోలు తీసినట్టు ఇస్రో పేర్కొంది.
 
ఫొటోల్లో కనిపిస్తున్న బండరాళ్ల ఎత్తు రెండు మీటర్లు ఉండగా, బిలాలు ఐదు మీటర్ల నుంచి 14 కిలోమీటర్ల వృత్తాకారంలో ఉన్నట్టు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఇప్పటికే సూర్య కిరణాలు ప్రసరిస్తున్నాయని, మరో వారం రోజుల్లో పూర్తిగా వెలుతురు వస్తుందని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

నేను గర్భందాల్చానా? ఎవరు చెప్పారు... : శోభిత ధూళిపాల

'శుభం' మూవీ చూస్తున్నంత సేవు కడుపుబ్బా నవ్వుకున్నా... సమంత తల్లి ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments