రెండు దశాబ్దాలకు పైగా భారత్ కంటున్న కల సాకారమైంది. భారీ ఉపగ్రహాల ప్రయోగానికి అత్యంత కీలకమైన క్రయోజనిక్ సాంకేతిక దశ భారత్ కైవశమైంది. విదేశాలపై ఆధారపడకుండా ఉపగ్రహ ప్రయోగాల్లో పూర్తి స్వావలంబనను సాధించాల
రెండు దశాబ్దాలకు పైగా భారత్ కంటున్న కల సాకారమైంది. భారీ ఉపగ్రహాల ప్రయోగానికి అత్యంత కీలకమైన క్రయోజనిక్ సాంకేతిక దశ భారత్ కైవశమైంది. విదేశాలపై ఆధారపడకుండా ఉపగ్రహ ప్రయోగాల్లో పూర్తి స్వావలంబనను సాధించాలన్న కల సోమవారం శ్రీహరి కోట నుంచి ప్రయోగించిన జీఎస్‌ఎ ల్‌వీ మార్క్–3డీ1 రాకెట్ ప్రయోగం విజయవంతం కావటంతో ఫలించింది. ఈ అద్భుత విజయంతో మూడు, నాలుగు టన్నుల బరువుండే భారీ ఉపగ్రహాలను అంత రిక్షంలోకి తీసుకెళ్లగలిగిన ‘జీఎస్‌ఎల్‌వీ (జియో సింక్రనస్ లాంచ్ వెహికిల్)’రాకెట్‌లో అత్యంత కీలకమైన క్రయోజనిక్ దశపై ఇస్రో పట్టుబిగించింది.
కొన్నేళ్ల కింద జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగాలు విఫలమైన నేపథ్యంలో ఈ క్రయో వ్యవస్థను పకడ్బందీగా రూపొందించేందుకు కొంత సమయం తీసుకుంది. ఇటీవలి వరకు జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల కోసం రష్యా తయారు చేసిన క్రయోజనిక్ ఇంజన్లు ఉపయోగించి ఆరు ప్రయోగాలు, సొంతంగా తయారు చేసిన ఒక క్రయో జనిక్ ఇంజన్‌తో ఒక ప్రయోగం చేశారు. ఇందు లో జీఎస్‌ఎల్‌వీ–డీ1 పేరుతో 2001 ఏప్రిల్ 18న చేసిన మొట్ట మొదటి ప్రయోగంలో 2 వేల కిలోల బరువైన జీశాట్–01 సమాచార ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు.
ఈ ఏడు జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో రెండు విఫలమయ్యాయి. 2010 ఏప్రిల్ 15న సొంత క్రయోజనిక్ ఇంజన్లతో కూడిన జీఎస్‌ఎల్‌వీ–డీ3ని ప్రయోగించగా విఫలమైంది. అదే ఏడాది డిసెంబర్ 25న రష్యా క్రయోజనిక్ ఇంజిన్‌తో చేసిన ప్రయోగం కూడా విఫలమైంది. దీంతో ఇస్రో దాదాపు రెండేళ్లపాటు జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల జోలికే వెళ్లలేదు. అనంతరం సొంతంగా పూర్తిస్థాయి క్రయోజనిక్ దశ అభివృద్ధిపై దృష్టి పెట్టింది.
క్రయోజనిక్ ఇంజన్‌లో ఇంధనంగా ఉపయో గించే లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్‌లను మైనస్ 220, మైనస్ 270 డిగ్రీల అతి శీతల పరిస్థితుల్లో ఉంచాల్సి ఉంటుంది. అతి సున్నితమైన ఈ క్రయోజనిక్ ప్రక్రియలో బాలారిష్టాలను దాటేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అవిరళ కృషి చేశారు. చివరికి విజయం సాధించారు. సొంతంగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన క్రయోజనిక్ ఇంజిన్లతో చేసిన నాలుగు ప్రయోగాలు వరుసగా విజయాలు సాధించాయి.
సోమవారం చేసిన జీఎస్‌ఎల్‌వీ మార్క్–3డీ1తో ఇందులో ఇస్రో పూర్తిస్థాయిలో పట్టు బిగించింది. మామూలు జీఎస్‌ఎల్‌వీలో మూడో దశలో ఉండే క్రయోజనిక్ దశలో 12.5 టన్నుల క్రయో ఇంధనాన్ని వాడతారు. అదే జీఎస్‌ఎల్‌వీ మార్క్–3లో క్రయోజనిక్ దశలో 25 టన్నులు (సీ–25) ఇంధనం ఉపయోగించారు. ఈ క్రయోజనిక్–25 వ్యవస్థను అభివృద్ధి చేయడా నికి దాదాపు రెండేళ్లు పట్టింది.