Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రయాన్-3పై ఆశలు నీరుగారినట్లే.. ఇస్రో శాస్త్రవేత్తలు

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2023 (11:40 IST)
చంద్రయాన్-3పై ఇస్రో శాస్త్రవేత్తలు ఆశలు వదిలేసుకున్నారు. స్లీపింగ్ మోడ్‌లో వున్న విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోవర్‌ను మేల్కొలిపారు. అయినా విక్రమ్ ల్యాండర్‌ను నిద్రలేపి పనిచేయించడం సాధ్యం కాదనే నిర్ణయానికి ఇస్రో వచ్చేసినట్లు తెలుస్తోంది. 
 
జాబిల్లిపై కాలుమోపి 14 రోజులపాటు పరిశోధనలు చేసి విలువైన సమాచారాన్ని సేకరించిన ఇవి రెండూ చంద్రుడిపై రాత్రి సమయం కావడంతో స్లీపింగ్ మోడ్‌లోకి వెళ్ళిపోయాయి. తిరిగి గత నెల 22న చంద్రుడిపై సూర్యోదయం కావడంతో వాటిని మళ్లీ నిద్రలేపి ప్రయోగాలకు పురమాయించాలని శాస్త్రవేత్తలు భావించారు. 
 
అప్పటి నుంచి వాటికి సిగ్నల్స్ పంపుతున్నా స్పందించడం లేదు. దీంతో విక్రమ్‌లో చలనం లేకపోవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు దానిపై ఆశలు వదిలేసుకున్నారు. 
 
నిజానికి అవి ఇప్పటికే మేల్కొనాల్సి ఉందని, కానీ ఆ పని జరగలేదంటే అవి ఇక నిద్రాణ స్థితి నుంచి బయటకు రావడం దాదాపు అసాధ్యమని ఇస్రో మాజీ చైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments