Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవాలో దారుణం.. నగ్నంగా రక్తపు మడుగులో విదేశీ యువతి.. ఏం జరిగింది?

గోవాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పర్యాటక రాష్ట్రంగా పేరొందిన గోవాకు విదేశీయుల రాక ఎక్కువే. అలా గోవాను సందర్శంచేందుకు వచ్చిన విదేశీ యువతిపై దారుణం జరిగింది. గోవాలో ఓ విదేశీ యువతి రక్తపు మడుగులో నగ్నం

Webdunia
బుధవారం, 15 మార్చి 2017 (17:41 IST)
గోవాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పర్యాటక రాష్ట్రంగా పేరొందిన గోవాకు విదేశీయుల రాక ఎక్కువే. అలా గోవాను సందర్శంచేందుకు వచ్చిన విదేశీ యువతిపై దారుణం జరిగింది. గోవాలో ఓ విదేశీ యువతి రక్తపు మడుగులో నగ్నంగా పడివుండటం కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఐర్లాండ్‌కు చెందిన ఓ మహిళ తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఇటీవల గోవాకు వచ్చింది. వీరిద్దరూ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఆపై విదేశీ యువతి కనిపించకుండా పోయింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆమె మృతదేహం నగ్నంగా బీచ్‌లోని నిర్మానుష్య ప్రాంతంలో రక్తపు మడుగులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దృశ్యం స్థానికులను భయభ్రాంతులను చేసింది. 
 
పోలీసులు విదేశీ యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గోవా మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. హత్యకు ముందు అత్యాచారం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మృతురాలి బాయ్‌ఫ్రెండ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

మరో మెగా వారసుడు రానున్నాడా? తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ - లావణ్య

మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు: చిరంజీవి

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

తర్వాతి కథనం