Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీబీఐ కస్టడీకి కార్తి చిదంబరం.... ఇద్రాణి నుంచి రూ.3 కోట్ల లంచం

ఐఎన్ఎక్స్ మీడియా కేసు కేంద్ర ఆర్థిక మాజీమంత్రి చిదంబరం తనయుడు కార్తి చిదంబరం మెడకు బలంగా చుట్టుకుంది. ఈ కేసులో ఆయనను ఇప్పటికే సీబీఐ అధికారులు అరెస్టుచేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఐదు రోజులపాటు సీబీఐ కస్టడ

Webdunia
గురువారం, 1 మార్చి 2018 (20:20 IST)
ఐఎన్ఎక్స్ మీడియా కేసు కేంద్ర ఆర్థిక మాజీమంత్రి చిదంబరం తనయుడు కార్తి చిదంబరం మెడకు బలంగా చుట్టుకుంది. ఈ కేసులో ఆయనను ఇప్పటికే సీబీఐ అధికారులు అరెస్టుచేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఐదు రోజులపాటు సీబీఐ కస్టడీకి కోర్టు ఆదేశించింది. దీంతో ఈనెల ఆరో తేదీ వరకు కార్తి వద్ద విచారణ చేయనున్నారు. 
 
నిజానికి లండన్ పర్యటనను ముగించుకుని బుధవారం స్వదేశానికి వచ్చిన కార్తిని.. చెన్నై ఎయిర్‌పోర్టులోనే ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆయనకు ఒక రోజు సీబీఐ కస్టడీకి ఆదేశించింది. దీనిని గురువారం మరో 5 రోజులపాటు పొడిగించింది.
 
కాగా, ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఐఎన్ఎక్స్ మీడియా ప్రమోటర్లు పీటర్, ఇంద్రాణీ ముఖర్జియా వాంగ్మూలాల ఆధారంగా ఆయనను అరెస్టు చేసింది. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆర్థిక మంత్రి హోదాలో పి.చిదంబరం చెప్పిన మీదట కార్తి చిదంబరానికి రూ.3 కోట్ల వరకు లంచం చెల్లించినట్లు పీటర్, ఇంద్రాణీ సీబీఐకి చెప్పారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments