Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవా హాలీడే ట్రిప్: రష్యన్ మహిళపై 2సార్లు అత్యాచారం!

Webdunia
శుక్రవారం, 24 అక్టోబరు 2014 (15:25 IST)
దేశంలోని మహిళలకే కాకుండా, విదేశీ మహిళలకు కూడా భారత్‌లో రక్షణ కరువైంది. రోజురోజుకూ మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్న తరుణంలో.. హాలీడే ట్రిప్ కోసం గోవాకు వచ్చిన రష్యన్ మహిళపై రెండుసార్లు అత్యాచారం జరిగింది. 
 
తొలిసారి 'బాగా' బీచ్‌లో ఆమెపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారం చేయగా, వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లగా అక్కడి వైద్యుడొకరు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. దీనిపై పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించాలని గోవా వైద్య, ఆరోగ్య శాఖ గోవా మెడికల్ కాలేజి హాస్పిటల్ (జీఎంసీహెచ్)ను ఆదేశించింది. 
 
ఈ నెల 16న గోవాకు చేరుకున్న బాధితురాలు 20వ తేదీ అర్ధరాత్రి 'బాగా' బీచ్‌లో అత్యాచారానికి గురైంది. బాధితురాలి నుంచి విలువైన వస్తువులను దోచుకున్న ఆగంతుకుడు ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేశాడు. 
 
ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాధితురాలిని పోలీసులు జీఎంసీహెచ్‌కు వైద్య పరీక్షల నిమిత్తం పంపారు. ఆస్పత్రిలో తొలుత ఓ మహిళా వైద్యురాలు బాధితురాలికి పరీక్షలు నిర్వహించారు. 
 
అనంతరం మరోమారు పరీక్షలు నిర్వహించేందుకు వచ్చిన సీనియర్ వైద్యుడు తనపై అత్యాచారం చేశాడని ఆమె ఫిర్యాదు చేసింది. దీనిపై సమగ్ర దర్యాప్తునకు గోవా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, గోవాలోని రష్యా రాయబార కార్యలయంలో లీగల్ అడ్వైజర్‌గా పనిచేస్తున్న వర్మ చెప్పారు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments