Webdunia - Bharat's app for daily news and videos

Install App

యోగ ముద్రలో ప్రపంచం... ఐక్యరాజ్యసమితి వేడుకల్లో 139 దేశాలు

ప్రపంచం యోగ ముద్రలో మునిగిపోయింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలు యోగాసనాల్లో నిమగ్నమయ్యారు. ఐక్యరాజ్య సమితి ఇచ్చిన పిలుపు మేరకు 139 దేశాలకు చెందిన ప్రజలు యోగసనాలను వేశారు.

Webdunia
మంగళవారం, 21 జూన్ 2016 (08:48 IST)
ప్రపంచం యోగ ముద్రలో మునిగిపోయింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలు యోగాసనాల్లో నిమగ్నమయ్యారు. ఐక్యరాజ్య సమితి ఇచ్చిన పిలుపు మేరకు 139 దేశాలకు చెందిన ప్రజలు యోగసనాలను వేశారు. అలాగే, భారత్‌లో యోగా వేడుకలకు చండీగఢ్‌ ప్రధాన వేదిక కానుంది.ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా పాల్గొని యోగాసనాలు వేశారు. చండీగఢ్‌లోని సుప్రసిద్ధ క్యాపిటల్‌ కాంప్లెక్స్‌లో ప్రధాని మోడీ 30 వేల మందితో కలిసి మంగళవారం యోగాసనాలు వేశారు. 
 
ఉదయం 4 గంటల నుంచే వేడుకలు జరిగే ప్రాంగణంలోకి అనుమతించగా, ప్రధాన కార్యక్రమం ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైంది. 7 గంటలకు యోగాసనాలు వేయడం ప్రారంభించి 45 నిమిషాలపాటు కొనసాగించారు. ప్రధాన వేడుక జరిగే కాంప్లెక్స్‌ను ఎనిమిది విభాగాలుగా విభజించారు. 500 మంది యోగా శిక్షకులు తమతమ బృందాలతో యోగాసనాలు వేసి చూపిస్తారు. ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉచిత బసు సర్వీసులను మడిపారు. ప్రజలు కూర్చునేందుకు 30 వేల మేడిన్‌ ఇండియా చాపలను సిద్ధం చేశారు. 
 
క్యాపిటల్‌ కాంప్లెక్స్‌లోనే కాదు చండీగఢ్‌వ్యాప్తంగా మరో 100 చోట్ల 10 వేల మందితో యోగా వేడుకలు నిర్వహించారు. ప్రధాని మోడీతో పాటు, పంజాబ్‌ సీఎం ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌, హరియాణా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ తదితర ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో 5000 మంది పారామిలటరీ, పోలీసు బలగాలు భారీ సంఖ్యలో మొహరించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments