స్వాతిని నేను హత్య చేయలేదు: నోరు విప్పిన రామ్ కుమార్.. ఇంతకీ ఎవరు చంపారు?
చెన్నై నుంగంబాక్కంలో హత్యకు గురైన స్వాతి హత్య కేసులో హంతకుడు ఎవరనే దానిపై క్లారిటీ రాలేదు. స్వాతిని హతమార్చింది రామ్ కుమార్ కాదని.. స్వాతి బాబాయ్ హంతకుడికి ఆశ్రయం కల్పించినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. తా
చెన్నై నుంగంబాక్కంలో హత్యకు గురైన స్వాతి హత్య కేసులో హంతకుడు ఎవరనే దానిపై క్లారిటీ రాలేదు. స్వాతిని హతమార్చింది రామ్ కుమార్ కాదని.. స్వాతి బాబాయ్ హంతకుడికి ఆశ్రయం కల్పించినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. తాజాగా స్వాతి హత్య కేసులో అరెస్టయిన రామ్ కుమార్‌ను కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా స్వాతిని తాను హతమార్చలేదని చెప్పడం ప్రస్తుతం సంచలనమైంది.
జూన్ 24వ తేదీ నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో స్వాతి దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసుపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు.. కస్టడీకి అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను స్వాతిని హతమార్చలేదని కోర్టులో రామ్ కుమార్ వెల్లడించాడు. స్వాతి కేసులో పోలీసులే అనవసరంగా తనను ఇరికించారని చెప్పాడు.
దీంతో రామ్ కుమార్‌ను 26వ తేదీ వరకు జ్యూడీషియల్ కస్టడీలో ఉంచాల్సిందిగా న్యాయమూర్తి గోపినాథ్ ఆదేశారు జారీ చేశారు. ఇంతవరకు స్వాతి హత్యకేసులో రామ్ కుమారే హంతకుడని పోలీసులు చెప్తూ వచ్చిన నేపథ్యంలో.. రామ్ కుమార్ ప్రస్తుతం యూ టర్న్ తీసుకోవడం చర్చనీయాంశమైంది.