Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోక్షం కోసం నిప్పంటించుకున్న యువకుడు

Webdunia
శనివారం, 13 ఆగస్టు 2022 (07:46 IST)
ఓ తెలుగు సినిమా చూసి ప్రభావితుడైన ఓ యువకుడు మోక్షం కోసం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్నాటకలోని తుముకూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆత్మహత్య చేసుకంటే మోక్షం లభించి పునర్జన్మ ఉండదని నమ్మిన యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. తన శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కర్ణాటకలోని తుమకూరు జిల్లా మధుగిరిలోని ఓ గ్రామానికి చెందిన రేణుకా ప్రసాద్ (23) ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలయ్యాడు. ఖాళీగానే ఉంటున్న యువకుడిని ఏదైనా పని చూసుకోవాలని తల్లిదండ్రులు పదేపదే చెప్పినా వినిపించుకోలేదు. 
 
ఇదిలావుండగా, చాలా సంవత్సరాల క్రితం విడుదలైన ఓ తెలుగు సినిమాను రేణుకా ప్రసాద్ ఇటీవల పలుమార్లు చూశాడు. ఆ సినిమా ప్రభావంతో ఆత్మహత్య చేసుకుని మోక్షం పొందాలని నిర్ణయించుకున్నాడు. ఆత్మహత్య చేసుకుంటే మోక్షం లభిస్తుందని, పునర్జన్మ కూడా ఉండదని యువకుడు విశ్వసించేవాడని స్థానికులు తెలిపారు. 
 
ఈ క్రమంలో గతవారం 20 లీటర్ల పెట్రోలు తీసుకుని గ్రామ శివారులోకి వెళ్లాడు. తాను ప్రాణత్యాగం చేసుకుని మోక్షం పొందుతున్నట్టు సెల్ఫీ వీడియో తీసుకుని తండ్రికి పంపి నిప్పంటించుకున్నాడు. రక్షించిన  స్థానికులు తీవ్రంగా గాయపడిన రేణుకా ప్రసాద్‌ను బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న మరణించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments