Webdunia - Bharat's app for daily news and videos

Install App

లింగ మార్పడి చేసుకుని పురుషుడిగా మారిన స్నేహితురాలిని మహిళను పెళ్లాడిన మహిళ!!

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2023 (08:59 IST)
లింగ మార్పిడి చేసుకుని పురుషుడిగా మారిన స్నేహితురాలిని ఓ మహిళ పెళ్లి చేసుకుంది. ఈ వివాహానికి జిల్లా కలెక్టర్ సైతం అనుమతి ఇచ్చారు. దీంతో ఫ్యామిలీ కోర్టులో ఈ వివాహం గత శుక్రవారం జరిగింది. ఆ తర్వాత సోమవారం మరోమారు హిందూ సంప్రదాయం ప్రకారం వారిద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో జరిగిన వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఇండోర్‌కు చెందిన 47 యేళ్ల అల్కా సోనీ అనే మహిళ.. కొంతకాలం తర్వాత తాను మహిళను కాదని గ్రహించి పురుషుడిగా జీవించడం మొదలుపెట్టింది. ఇటీవల తన 47వ పుట్టిన రోజు వేడుకలను అల్కా సోనీ జరుపుకుంది. అదేరోజున ధైర్యం చేసి లింగమార్పిడి చేసుకుని స్త్రీ నుంచి పక్కా పురుషిడిగా మారిపోయి, తన పేరును కూడా అస్తిత్వ సోనీగా మార్చుకున్నాడు. 
 
ఈ క్రమంలో చాలాకాలంగా స్నేహం చేస్తున్న తన స్నేహితురాలు ఆస్తాను పెళ్లాడింది. ఫ్యామిలీ కోర్టులో జరిగిన ఈ ప్రత్యేక వివాహానికి ఇరు కుటుంబాల సభ్యులు హాజరయ్యారు. వీరిద్దరూ గురువారం పెళ్లి ధృవీకరణ పత్రాన్ని కోర్టు నుంచి స్వీకరించారు. 
 
దీనిపై ఆస్తా స్పందిస్తూ, అస్తిత్వ సోనీ పురుషుడుగా మారకముందు నుంచే తనకు పరిచయం ఉందని చెప్పింది. ఆ తర్వాత తమ పరిచయం ప్రత్యేక బంధంగా మారిందని, దీంతో ఇండోర్ కలెక్టర్‌కు తమ పరిస్థితిని వివరించి ప్రత్యేక వివాహానికి అనుమతి కోరగా ఆయన మంజూరు చేశారని తెలిపారు. ఆ తర్వాత తమ ఇద్దరి కుటుంబాల అనుమతితో తామిద్దరం ఒక్కటైనట్టు వివరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments