Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరిగిపోతున్న ఇండోనేషియా భూకంప మృతులు

Webdunia
మంగళవారం, 22 నవంబరు 2022 (19:59 IST)
ఇండోనేషియలోని ప్రధాన ద్వీపం జావా పశ్చిమ భాగంలో సోమవారం సంభవించి భారీ భూకంపం ధాటికి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఆరంభంలో కేవలం 46 మంది మాత్రమే చనిపోయినట్టు ఇండోనేషియా అధికారులు ప్రకటించారు. కానీ, ఇపుడు ఈ సంఖ్య 268కి పెరిగింది. సియాంజర్ పట్టణానికి సమీపంలోని 5.6 తీవ్రతతో ప్రకంపనలు రాగా భారీ నష్టం వాటిల్లిన విషయం తెల్సిందే. 
 
భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శిథిలాలను తొలగించే కొద్దీ శవాలు బయటపడుతున్నాయి. దీంతో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోది. ఈ భూకంపం సృష్టించిన విధ్వంసంలో వెయ్యికి మంది వరకు గాయపడ్డారని ఓ అధికారి తెలిపారు. 
 
సహాయక చర్యల్లో నిమగ్నమైవున్న అధికారి ఒకరు మాట్లాడుతూ, ఈ భూకంపం వల్ల మరణించిన వారిలో అత్యధికులు చిన్నారులేనని వెల్లడించారు. విద్యార్థులు స్కూల్లో ఉండగా భూకంపం సంభవించడంతో ప్రాణనష్టం అధికంగా జరిగినట్టు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments