అపరిశుభ్రమైన - అసౌకర్యమైన సీటు కేటాయింపు - ఇండిగో సంస్థకు అపరాధం

ఠాగూర్
ఆదివారం, 10 ఆగస్టు 2025 (13:45 IST)
ఓ ప్రయాణికురాలికి అపరిశుభ్రమైన, అసౌకర్యవంతమైన సీటును కేటాయించినందుకు ప్రముఖ ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో విమానయాన సంస్థకు ఢిల్లీ వినియోగదారుల ఫోరం కోర్టు అపరాధం విధించింది. రూ.1.5 లక్షల జరిమానాను సదరు ప్రయాణికురాలికి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 
 
గత జనవరి నెల 5వ తేదీన తాను ప్రయాణించిన బాకు - న్యూఢిల్లీ ఇండిగో విమానంలో తనకు అపరిశుభ్రమైన సీటను కేటాయించినట్టు పింకీ అనే మహిళా ప్రయాణికురాలు ఢిల్లీలోని వినియోగదారుల ఫోరం కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనివల్ల తాను శారీరకంగా, మానసికంగా ఇబ్బందిపడినట్టు తెలిపింది. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన కమిషన్ ప్రయాణికురాలు ఎదుర్కొన్న అసౌకర్యం, మానసిక వేదనకు పరిహారం చెల్లించాలని ఇండిగో సంస్థను ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి ఆమె ఖర్చు చేసిన రూ.25 వేలు కూడా చెల్లించాలని పేర్కొంది. 
 
అయితే, ఈ ఆదేశాలను ఇండిగో సంస్థ వ్యతిరేకించింది. ప్రయాణికురాలికి కేటాయించిన సీటు సరిగ్గా లేకపోవడంతో ఆమె అభ్యర్థన మేరకు తాము వేరే సీటును కేటాయించి, ఆమె ప్రయాణం సాఫీగా పూర్తయ్యేలా చేసినట్టు తెలిపింది. అయితే, వినియోగదారుల ప్రయాణ సమాచారాన్ని తెలిపే అంతర్గత కార్యాచరణ రికార్డులో భాగమైన సిట్యుయేషన్ డేటా డిస్ ప్లే (ఎస్.డి.డి.) నివేదిక సమర్పించడంలో ఎయిర్‌లైన్స్ విఫలం కావడంతో జరిమానాను చెల్లించాల్సిందేనంటూ ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments