భారత నుంచి చుక్కనీరు పోనివ్వం... అన్నీ మేమే వాడుకుంటాం : ప్రధాని మోడీ

ఠాగూర్
బుధవారం, 7 మే 2025 (11:30 IST)
భారత్ నుంచి పాకిస్థాన్‌కు చుక్క నీరు పోనివ్వబోమని, అన్ని జలాలు మేమే వాడుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న నదీ జలాల ఒప్పందం ఇండస్ ట్రీటి (సింధూ నదీ జలాల ఒప్పందం)ని భారత ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో పాకిస్థాన్ గగ్గోలు పెడుతోంది. 
 
ఈ ఒప్పందం రద్దు తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి స్పందించారు. ఇక నుంచి భారత్‌కు చెందిన జలాలు దేశ ప్రయోజనాలకే వినియోగిస్తామని, పాకిస్థాన్‌కు చుక్క నీరు పోనివ్వమన్నారు. భారతీయ జలాలు ఇప్పటివరకు వెలుపలికి వెళ్లాయని, ఇకపై అది జరగదన్నారు. మన జలాలు - మన హక్కు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. మన జలాలు ఇకపై మన అవసరాలకే వినియోగిస్తామని ఆయన అన్నారు.
 
చినాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ ఆనకట్ట నుండి పాకిస్థాన్‌కు నీటి ప్రవాహాన్ని నిలిపివేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న తరుణంలో, జీలం నదిపై ఉన్న కిషన్ గంగా ప్రాజెక్టు నుండి ప్రవాహాలను తగ్గించడానికి సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో మోదీ ఈ ప్రకటన చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments