Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌కు అమెరికా కోర్టు సమన్లు.. మోదీ, గౌతమ్ అదానీకి కూడా...

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (16:49 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీకి అమెరికా కోర్టు సమన్లు జారీ చేసింది. మోదీ, జగన్​, అదానీకి ఆగస్టు 4న, స్విట్జర్లాండ్‌లో ఉన్న క్లాస్​ స్క్వాబ్‌కు ఆగస్టు 2న సమన్లు వెళ్లాయి. అయితే న్యూయార్క్‌కు చెందిన ప్రముఖ భారతీయ-అమెరికన్ అటార్నీ జనరల్​ రవి బాత్రా దీనిని "డెడ్ ఆన్ అరైవల్ దావా"గా పేర్కొన్నారు. 
 
ఈ దావాపై సంతకం చేయడానికి న్యాయవాదులెవరూ అంగీకరించలేదని ఆయన చెప్పారు. డాక్టర్​ లోకేశ్ ఖాళీగా ఉన్నారని, అందుకే 53 పేజీల దావా వేశారని బాత్రా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
 
అవినీతి, పెగాసస్ స్పైవేర్‌, అమెరికాకు నగదు తరలింపు తదితర ఆరోపణలతో భారతీయ అమెరికన్‌ వైద్యుడు  లోకేశ్ దావా వేశారు. 
 
రాజకీయ ప్రత్యర్థులపై పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగిస్తున్నారని ఆయన వ్యాజ్యంలో ఆరోపించారు. భారతీయ-అమెరికన్‌ డాక్టర్‌ ఉయ్యూరు లోకేశ్‌ అమెరికాలో కొలంబియా డిస్ట్రిక్ట్‌ కోర్టులో ఈ ఏడాది మే 24న 53 పేజీల పిటిషన్‌ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డా.లోకేశ్.. అమెరికాలోని రిచ్‌మండ్‌లో గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌గా పని చేస్తున్నారు.
 
ప్రపంచ ఆర్థిక వేదిక వ్యవస్థాపకుడు క్లాస్​ స్క్వాబ్​ పేరును కూడా లోకేశ్ దావాలో​ ప్రస్తావించారు. ఈ వ్యాజ్యంపై విచారణ కోసం కొలంబియా డిస్ట్రిక్ట్​ కోర్టు వీరికి సమన్లు జారీ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments