Webdunia - Bharat's app for daily news and videos

Install App

#NavyDay : విశాఖ తీరంలో స్వర్ణోత్సవ సంబరాలు

నేవీ డేను పురస్కరించుకుని తూర్పు తీర నౌకాదళం స్వర్ణోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహిస్తోంది. 1968 మార్చి ఒకటిన విశాఖలో ఆవిర్భవించిన తూర్పునౌకాదళం 2017మార్చి నుంచి 2018 మార్చి ఒకటో తేదీ వరకు స్వర్ణోత్సవ సంబ

Webdunia
సోమవారం, 4 డిశెంబరు 2017 (09:25 IST)
నేవీ డేను పురస్కరించుకుని తూర్పు తీర నౌకాదళం స్వర్ణోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహిస్తోంది. 1968 మార్చి ఒకటిన విశాఖలో ఆవిర్భవించిన తూర్పునౌకాదళం 2017మార్చి నుంచి 2018 మార్చి ఒకటో తేదీ వరకు స్వర్ణోత్సవ సంబరాలను జరుపుకుంటున్న విషయం తెల్సిందే. 
 
భారత నౌకాదళం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పండుగల్లో ఏటా డిసెంబరు 4న జరిపే నౌకాదళ దినోత్సవం ప్రధానమైనది. 1971వ సంవత్సరంలో పాకిస్థాన్‌లోని కరాచీ హార్బర్‌పై భారత నౌకాదళ మిసైల్‌బోట్లు పెద్దఎత్తున దాడులు చేసి అతిపెద్ద విజయాన్ని సాధించిపెట్టాయి. తూర్పు నౌకాదళంపై దాడి చేయడానికి విశాఖ తీర సమీపానికి వచ్చిన పాకిస్థాన్‌ నౌకాదళానికి చెందిన పి.ఎన్‌.ఎస్‌.ఘాజీ జలాంతర్గామిని కూడా విజయవంతంగా నిలువరించాయి.
 
తూర్పు తీరంలోని అన్ని ప్రాంతాలు శత్రుదుర్భేద్యంగా ఉంచాలన్న లక్ష్యంతో పశ్చిమబెంగాల్‌ నుంచి తమిళనాడు వరకు విస్తరించి ఉన్న తీర ప్రాంతంలో పలుచోట్ల వ్యూహాత్మకంగా నౌకాదళ స్థావరాలను ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. ఒక్క విశాఖ తూర్పు నౌకాదళంలోనే సుమారు ఐదు వేల మందికిపైగా నౌకాదళ అధికారులు, ఉద్యోగులు నిత్యం తీరభద్రతకు సంబంధించిన కార్యకలాపాల్లో తలమునకలై ఉంటారు. 
 
విశాఖ కేంద్రంగా సుమారు 40 వరకు యుద్ధనౌకలు, జలాంతర్గాములను వివిధ ప్రాంతాల్లో మోహరించి భారత తీరాన్ని కాపాడుతుంటారు. తూర్పుతీరం వైపునున్న 18 దేశాలతో తూర్పునౌకాదళం సన్నిహిత సంబంధాలు నెరుపుతూ ప్రపంచంలోని అతిపెద్ద నౌకాదళాల్లో ఒకటిగా పలు చిన్నదేశాలకు అండగా నిలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments