Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూతురు కోసం పక్కింటి అబ్బాయికి 'ప్లగ్' పెట్టిన ఆంటీ... ఏం చేసింది?

నేనేమైనా ఫర్లేదు పక్కింటివాడు మాత్రం బాగుపడకూడదనే మనస్తత్వం కొందరిలో ఉంటుంది. అలాంటి పనే జైపూర్‌లో ఆంటీ చేసింది. ఆమె తన కుమార్తెను ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్నత చదువులు చదివించాలనుకుంది. అలాగే పక్కింట్లో నివాసం ఉండే మరో యువకుడు కూడా సిడ్నీలో చదివేంద

Webdunia
బుధవారం, 27 జులై 2016 (16:24 IST)
నేనేమైనా ఫర్లేదు పక్కింటివాడు మాత్రం బాగుపడకూడదనే మనస్తత్వం కొందరిలో ఉంటుంది. అలాంటి పనే జైపూర్‌లో ఆంటీ చేసింది. ఆమె తన కుమార్తెను ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్నత చదువులు చదివించాలనుకుంది. అలాగే పక్కింట్లో నివాసం ఉండే మరో యువకుడు కూడా సిడ్నీలో చదివేందుకు నిర్ణయించుకున్నాడు. ఇరుగుపొరుగు కావడంతో ఇద్దరూ కలిసి వీసాకు దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడే ఓ చిక్కు వచ్చి పడింది. ఆంటీ కుమార్తెకు అధికారులు వీసాను నిరాకరించారు. కానీ పొరుగింటి అబ్బాయి రాజ్ సింగుకు మాత్రం వీసా వచ్చింది. దీనితో అతడు ఆస్ట్రేలియాకు ప్రయాణమయ్యాడు. 
 
లగేజీలంతా తీసుకుని విమానాశ్రయానికి వెళ్లాడు. మరికొద్ది నిమిషాల్లో విమానం ఎక్కబోతున్నాడనగా ఎయిర్ పోర్ట్ అధికారులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. రాజ్ సింగ్ బ్యాగుల్లో బాంబులు ఉన్నాయంటూ ఆ ఫోన్ కాల్ సారాంశం. దానితో అధికారులు వెనువెంటనే అతడిని ఆపేసి అతడి బ్యాగులన్నీ చెక్ చేశారు. వారికి ఎలాంటి అనుమానం కలుగలేదు. దీనితో ఆ ఫోన్ నెంబరు ఎవరిదని దర్యాప్తు చేయగా తమ పొరుగుంటి ఆంటీదని తేల్చాడా యువకుడు. దీంతో ఆమె వద్ద విచారణ జరుపగా, తన కుమార్తెకు వీసా రాకపోగా పక్కింటి అబ్బాయికి వీసా రావడం, అతడు ఉన్నత చదువులకు వెళ్తుండటాన్ని జీర్ణించుకోలేక అలాంటి పనికి పూనుకున్నట్లు చెప్పాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments