Webdunia - Bharat's app for daily news and videos

Install App

నూతన సాంకేతికతలతో బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం సక్సెస్

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (13:57 IST)
భారత రక్షణ - పరిశోధనా అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) మరోమారు బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించింది. ఈ క్షిపణికి కొత్తగా పలు సాంకేతికతలను జోడించి ప్రయోగించింది. ఈ ప్రయోగం విజయవంతంగా ముగిసినట్టు డీఆర్డీవో విడుదలచేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ కొత్త వెర్షన్‌ను గురువారం ఒడిశా రాష్ట్ర తీరంలోని బాలాసోర్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించినట్టు తెలిపింది. 
 
ఈ మిస్సైల్‌కు కొత్తగా కొన్ని నూతన సాంకేతికతలను జోడించారు. అవి పని చేస్తాయా లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు వీలుగా ఈ ప్రయోగం మళ్లీ చెపట్టారు. ఇందులో కొత్త సాంకేతికతలు సమర్థవంతంగా పని చేస్తున్నాయని డీఆర్డీవో అధికారులు వెల్లడించారు. ఇదిలావుంటే ఈ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్‌ను డీఆర్డీవోతో పాటు రష్యాకు చెందిన ఎన్.పి.ఓ.ఎంలు కలిసి అభివృద్ధి చేశాయి.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments