Webdunia - Bharat's app for daily news and videos

Install App

25న మధ్యాహ్నం 12.01 గంటలకు శుభాంశు శుక్లా రోదసీయాత్ర

ఠాగూర్
మంగళవారం, 24 జూన్ 2025 (09:17 IST)
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసియాత్ర ప్రయాణ తేదీ ఖరారైంది. 'యాక్సియ-4' మిషన్‌లో భాగంగా ఈ నెల 25 తేదీన ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పయనంకానున్నారు. ఈ మేరకు మంగళవారం నాసా ఓ ప్రకటన విడుదల చేసింది. 'యాక్సియం-4' మిషన్ ప్రయోగం 25వ తేదీ మధ్యాహ్నం 12.01 గంటలకు రోదసీలోకి దూసుకెళ్లనుందని తెలిపింది. ఫ్లోరిడాలోని నాసా కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. 
 
'యాక్సియం-4'లో శుభాంశు శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ ఈ మిషన్‌ను నిర్వహిస్తోంది. ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ, ఐరోపా అంతరిక్ష సంస్థలు ఇందులో భాగస్వామ్యం వహిస్తున్నాయి. 
 
ఈ స్పేస్ క్యాప్సూల్‌ను ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి మోసుకెళుతోంది. ఇందులో శుభాంశు శుక్లా మిషన్ పైలెట్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. నిజానికి ఈ ప్రయోగం మే 29వ తేదీన జరగాల్సివుంది. అయితే, వాతావరణం అనుకూలించకపోవడం, సాంకేతిక సమస్య తలెత్తడం వంటి కారణాలతో పలుమార్లు వాయిదాపడింది. 
 
భూమి నుంచి బయలుదేరిన 28 గంటల తర్వాత ఈ వ్యోమనౌక.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమవుతుంది. శుభాంశు శుక్లా బృందం అక్కడే 14 రోజుల పాటు ఉంటుంది. భారరహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహించడంతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, పాఠశాల విద్యార్థులు ఇతరులతో అక్కడ నుంచి ముచ్చటిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments