Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోడీ

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (08:43 IST)
దేశ వ్యాప్తంగా అమల్లో ఉన్న అన్‌లాక్-1 జూన్ 30వ తేదీతో ముగియనుంది. దీంతో జూలై ఒకటో తేదీ నుంచి కొత్త మార్గదర్శకాలను కేంద్రం సోమవారం రాత్రి విడుదలచేసింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం సాయంత్రం 4 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. భారత్-చైనా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
 
ఈ నేపథ్యంలో ప్రధాని ప్రజలకు ఏం చెప్పబోతున్నారన్న దానిపై  అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే, నేటితో అన్‌లాక్-1 ముగియనున్న నేపథ్యంలో అన్‌లాక్-2కు సంబంధించి మోదీ మాట్లాడే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.
 
మరోవైపు, భారత్ - చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. ఈ ఉద్రిక్తతలు సద్దుమణిగేలా ఇరు దేశాల సైనిక కమాండర్ స్థాయి చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు, దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని భావించిన చైనాకు చెందిన 59 యాప్‌లను కేంద్రం నిషేధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments