Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ ధర్మసత్రం కాదు... ఇక్కడ స్థిరపడటానికి మీకేం హక్కు ఉంది? సుప్రీంకోర్టు

ఠాగూర్
సోమవారం, 19 మే 2025 (17:02 IST)
శ్రీలంకకు చెందిన ఎల్టీటీఈ ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో 2015లో సదరు శ్రీలంక జాతీయుడుని భారత్‌లో అరెస్టు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం కింద 2018లో ట్రయల్ కోర్టు అతడిని దోషిగా నిర్ధారించి, పదేళ్ళ శిక్ష విధించింది. అయితే, 2022లో మద్రాస్ హైకోర్టు ఈ శిక్షను ఏడేళ్ల కాలానికి తగ్గించింది. శిక్షాకాలం పూర్తయిన తర్వాత దేశం విడిచి వెళ్లాలని అప్పటివరకు శరణార్థ శిబిరంలో ఉండాలని ఆదేశించింది. దీంతో సదరు శ్రీలంక తమిళ జాతీయుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. 
 
తాను వీసాపైనే భారత్‌కు వచ్చానని, స్వదేశంలో తనకు ప్రాణహాని ఉందని, పైగా, తన భార్యాపిల్లలు ఇక్కడే స్థిరపడ్డారని తన పిటిషన్‍లో పేర్కొన్నారు. శిక్ష పూర్తయినా దాదాపు మూడేళ్లుగా నిర్బంధంలోనే ఉంచారని, దేశం నుంచి పంపించే ప్రక్రియను కూడా ప్రారంభించలేదని పేర్కొన్నారు. 
 
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు... భారత్ ధర్మసత్రం కాదు అని ఘాటుగా వ్యాఖ్యానించింది. పైగా, ఆర్టికల్ 19 హక్కులు కేవలం భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయని తేల్చిచెప్పింది. ఇక్కడ స్థిరపడటానికి మీకేం హక్కు ఉంది అని సూటిగా ప్రశ్నించింది. 
 
తాను శరణార్ధినని, శ్రీలంకలో తన ప్రాణాలకు ముప్పు ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది పదేపదే విన్నవించినప్పటికీ ధర్మాసనం అంగీకరించలేదు. భారతదేశం మీ కోసం ఎదురుచూడటం లేదు. మీరు కోరుకుంటే మరో దేశానికి వెళ్లవచ్చు అని సూచిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. చట్టప్రకారం నిర్ధేశించిన ప్రక్రియను పూర్తయిన తర్వాత పిటిషనర్‌ను శ్రీలంకకు పంపించాలని అధికారులను ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments