భారత్‌లో బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాల నిలిపివేత!?

ఠాగూర్
శుక్రవారం, 13 జూన్ 2025 (15:32 IST)
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఏకంగా 241 మంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. కేవలం ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రమే సజీవంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకోనుంది. దేశంలో బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాలను నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు కేంద్ర విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 
 
తొలుత తాత్కాలికంగా సేవలను నిలిపివేసి, ఆ తర్వాత భద్రతను సమీక్షించిన తర్వాత ఈ విమానం సేవలను పూర్తిగా నిలిపివేయాలా లేదా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు భారత్, అమెరికా ఏజెన్సీల మధ్య సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. అంతేకాకుండా తాజాగా దుర్ఘటనకు సంబంధించి దర్యాప్తు పూర్తయిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఎయిరిండియాతోపాటు విమాన నిర్వహణ విధానంపై ఇతర విమానయాన సంస్థలకు కూడా కేంద్రం నోటీసులు పంపే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 
 
కాగా, గురువారం అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విమాన ప్రయాణికులు 241తో కలిపి మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన గగనతలంలో ప్రమాణాల భద్రతకు సంబంధించిన అంశాలను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. ప్రపంచంలోని వివిధ సంస్థల తయారీ విమానాలతో పోల్చినపుడు బోయింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు సాంకేతికత, భద్రత, వేగం, ఇంధన వినియోగం పరంగా అత్యున్నమైనవనే అభిప్రాయం ఉంది. కానీ, అహ్మదాబాద్ విమాన ప్రమాద నేపథ్యంలో ఈ విమానాల భద్రతపై ఇపుడు అనేక సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అరి.. ప్రయాణంలో తండ్రిని, బావని కోల్పోయిన దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments