Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత చివరి కోరిక మాత్రం నెరవేరలేదు... మీరు చూస్తూ ఉండండి ప్రధాని సీటులో కూర్చుంటా..

తమిళనాడు దివంగత సీఎం జయలలిత అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం చెన్నై మెరీనా బీచ్‌లో ముగిశాయి. జయలలితను చివరి చూపు కోసం వివిధ రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున జనం తరలివచ్చారు. బస్సులన్నీ రద్దుచేసిన జనం రైళ్లు,

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2016 (08:14 IST)
తమిళనాడు దివంగత సీఎం జయలలిత అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం చెన్నై మెరీనా బీచ్‌లో ముగిశాయి. జయలలితను చివరి చూపు కోసం వివిధ రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున జనం తరలివచ్చారు. బస్సులన్నీ రద్దుచేసిన జనం రైళ్లు, ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసుకుని జనం చెన్నైకు చేరుకున్నారు. చెన్నై సెంట్రల్‌కు చేరుకున్న సిటీ రైళ్ల నుంచి అన్నాసాలైకు చేరుకున్నారు.
 
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనంతో అన్నాసాలై కూడలి జనంతో కిక్కిరిసింది. రాజాజీహాలు వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి జయలలిత పార్థివదేహం వరకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కూడలి నుంచి బారికేడ్లు ఏర్పాటు చేసినా... భారీ ఎత్తున జనం చొచ్చుకు రావటంతో పోలీసులు వారిని నిలువరించలేకపోయారు. 
 
ఈ నేపథ్యంలో.. అమ్మ చివరి కోరిక మాత్రం నెరవేరలేదని అన్నాడీఎంకే కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ''మీరు చూస్తూ ఉండండి... నేను ఎప్పటికైనా ముందు సీటులో ఉన్న ప్రధాని సీట్లో కూర్చుంటా'' అని రాజ్యసభ సభ్యురాలిగా వెనక బెంచీలో కూర్చున్న జయలలిత తన పక్కన కూర్చున్న నామినేటేడ్‌ సభ్యుడు, జర్నలిస్టు కుష్వంతసింగ్‌కు చెప్పేవారు. ఎప్పటికైనా ప్రధాని కావాలన్నదే ఆమె కోరిక.. ఆ కోరిక నెరవేరకుండా పోయింది. 
 
1999లో ఆ అవకాశం ఒక్కసారి వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ కారణంగానే తనకు ప్రధాని పదవి దక్కలేదన్న కోపంతో అప్పటి నుంచి కాంగ్రెస్‌తో సంబంధాలను తెంచుకుని బీజేపీకి జయలలిత దగ్గరయ్యారు. అందుకే వాజ్‌పేయి ప్రభుత్వాన్ని కూడా పడగొట్టారు. కాంగ్రెస్ తనకు మద్దతునిచ్చి ప్రధానిని చేస్తుందనుకుంటే అది కూడా జరగలేదు.
 
1979లో మొరార్జీ దేశాయ్‌ను పడగొట్టి చరణ్‌సింగ్‌ను, 1989లో వీపీ సింగ్‌నును తొలగించి చంద్రశేఖర్‌ను ప్రధానిని చేసిన కాంగ్రెస్‌ తన విషయంలో మొండి చేయి చూపించిందన్న కోపం జయలలితకు చివరి వరకూ ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments